ETV Bharat / city

తగ్గిన కాలుష్యం.. పెరిగిన పక్షుల సంచారం

మనుషులు నిర్బంధంలోకి వెళ్లిపోయారు. ట్రాఫిక్‌ లేదు..కాలుష్యం లేదు. ఈ వాతావరణం పక్షులకు వరమైంది. శివారు ప్రాంతాల నుంచి నగరంలోకి పక్షుల వలసలు భారీగా పెరిగాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎక్కువ సంఖ్యలో పక్షులు కనబడుతున్నాయని పక్షి ప్రేమికులు చెబుతున్నారు.

birds
పక్షుల సంచారం
author img

By

Published : Apr 8, 2020, 10:11 AM IST

ఉదయం పూట పక్షుల కిలకిలారావాలే నగరవాసుల్ని నిద్ర లేపుతున్నాయి. జలాశయాలు, చెరువుల వద్ద వీటి కదలికలు పెరిగినట్లు పక్షుల సంరక్షణ సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు. జన సంచారం లేకపోవడం వల్ల పిచ్చుకలు, చిలుకలు, టేలర్‌బర్డ్స్‌, గోరింకలు, బాబ్లర్స్‌ ప్రస్తుతం ఎక్కువ సంఖ్యలో కనిపిస్తున్నాయి. శివారు ప్రాంతాల్లో వీటి సంచారం అబ్బురపరుస్తోంది.

నకనకలాడుతున్నాయి..

లాక్‌డౌన్‌ పరిస్థితుల్లో నగరంలోని పక్షులకు తిండి గింజలు కరవయ్యాయి. ఎక్కడా మనుషులు కానరాకపోవడంతో ఆకలితో నకనకలాడుతున్నాయి. భానుడి భగభగల మధ్య దాహార్తితో అలమటించిపోతున్నాయి. ప్రజలంతా ఇళ్లకే పరిమితం అవ్వడంతో వాటికి ఆహారం అందించేవారు కరువయ్యారు. కోఠి, అమీర్‌పేట్‌, ట్యాంక్‌బండ్‌, చార్మినార్‌ తదితర 15 ప్రాంతాల్లో పక్షులకు ఆహారం అందించే ప్రదేశాలున్నాయి.

పర్యాటకులు, నగరవాసులు ఆయా ప్రదేశాల్లో కొనుగోలు చేసిన దాణాను పక్షులకు వేస్తూ ఉండేవారు. ప్రస్తుతం ఎవరూ బయటికి వచ్చే పరిస్థితి లేకపోవడంతో పక్షులను పట్టించుకునేవారే కరవయ్యారు. నగరవాసులు వారి డాబాల పైన పక్షులకు ఆహారం, నీరు సమకూర్చి, మానవత్వాన్ని చాటాలని పక్షి ప్రేమికులు సూచిస్తున్నారు.

మనసు మెచ్చెన్‌.. స్వచ్ఛత పంచెన్‌..

లాక్‌డౌన్‌ నేపథ్యంలో రోడ్లపై వాహనాలు కనిపించడం లేదు. అంతేగాక వాహనాల రణగొణ ధ్వనులతో హోరెత్తే నగరం.. ప్రస్తుతం ప్రశాంతంగా ఉంది. వాయు, ధ్వని కాలుష్యం తీవ్రత క్రమంగా తగ్గుతూ వస్తోంది. వాయు నాణ్యత సూచిక ప్రకారం గాలిలో 50 మైక్రో గ్రామ్‌ ఇన్‌ క్యూబిక్‌ మీటర్స్‌ ఉండాలి. కానీ గ్రేటర్‌లో 100-160 ఎంజీక్యూఎంగా నమోదవుతూ ఉండేది.

ప్రస్తుతం పరిశ్రమలు మూతపడి, అధిక శాతం వాహనాలు ఆగిపోవడంతో మహానగరంలో 100 కంటే తక్కువగా నమోదవుతున్నట్లు కాలుష్య నియంత్రణ మండలి అంచనా వేసింది. స్వచ్ఛమైన గాలి పీల్చుకునే అవకాశం వచ్చిందని సామాజిక వేత్తలు విశ్లేషిస్తున్నారు. మనసు నచ్చే వాతావరణంలో కొద్దికాలం సేదతీరే అవకాశం వచ్చిందని భావిస్తున్నారు.

ఇవీ చూడండి: బయటికొస్తే... బండి లోపలికే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.