ETV Bharat / city

చెత్తను గ్యాస్​గా మార్చే  ఫ్లెక్సీ ప్లాంట్​ - undefined

తక్కువ స్థలంలో, తక్కువ డబ్బుతో... ఎక్కువ గ్యాస్​ను తయారుచేసుకోవచ్చు. అది కూడా మన ఇంట్లో పేరుకుపోయే చెత్త నుంచి. ఎలా అనుకుంటున్నారా... మీ ఇంట్లో ఫ్లెక్సీ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుంటే సరి.

చెత్తను గ్యాస్​గా మార్చే  ఫ్లెక్సీ ప్లాంట్​
author img

By

Published : Mar 16, 2019, 9:45 PM IST

Updated : Mar 16, 2019, 11:13 PM IST

చెత్తను గ్యాస్​గా మార్చే ఫ్లెక్సీ ప్లాంట్​
నగరాల్లో, గ్రామాల్లో ఎక్కడ చూసినా చెత్త. స్వచ్ఛ భారత్ లాంటి ఎన్ని కార్యక్రమాలొచ్చిన ఈ సమస్య మాత్రం తగ్గడం లేదు. నగరీకరణ పెరగడంతో డంపింగ్ యార్డులకు స్థలం కొరత ఏర్పడింది. కుప్పలు కుప్పలుగా పోగవుతున్న చెత్తను శక్తి వనరులుగా మార్చే సాంకేతికత ఉన్నా... అందరికీ అందుబాటులో లేదు. తక్కువ స్థలంలో పొలాలు, ఇళ్లలో ఉత్పత్తయే చెత్తతో ఇంధనం తయారు చేసే వెసులు బాటు ఉంటే బాగుంటుందనే ఆలోచన నుంచి పుట్టిందే ఫ్లెక్సీ బయోగ్యాస్ ప్లాంట్.

తక్కువ స్థలం, తక్కువ ఖర్చు...

ఫ్లెక్సిబుల్ పీవీసీ ఫ్యాబ్రిక్​తో తయారు చేసిన బెలూన్ లాంటి ఈ ప్లాంట్ చూడటానికి అందంగానే ఉంటుంది. అంతే కాకుండా తక్కువ స్థలం, తక్కువ ఖర్చుతో ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ ప్లాంట్ నెలకొల్పడం, తొలగించటం చాలా తేలిక. విస్తీర్ణం ఆధారంగా ప్లాంట్​ను పెద్దగా లేదా చిన్నగా ఏర్పాటు చేసుకొని బయోగ్యాస్ ఉత్పత్తి చేయవచ్చు. విస్తీర్ణం దృష్ట్యా రెండు క్యూబిక్ మీటర్ల బయోగ్యాస్ ప్లాంట్ నుంచి రెండు సిలిండర్ల మేర గ్యాస్ ఉత్పత్తవుతుంది. ఇందుకోసం 30 కేజీల ఆహార వ్యర్థాలు లేదా 60 కేజీల పశువుల పేడ అవసరమవుతాయి. అదే 5 క్యూబిక్ మీటర్ల ప్లాంట్​కు 50 కేజీల ఆహార వ్యర్థాలు లేదా 125 కేజీల పశువుల పేడ అవసరమవుతాయి. అపార్ట్ మెంటు వాసులకు, వ్యవసాయదారులు, పాడిరైతులకు ఈ విధానంతో చెత్త సమస్య తీరటమే కాక, ఇంధన ఖర్చులు ఆదా అవుతాయి.

ప్లాంట్ నెలకొల్పాలనుకునే జౌత్సాహికులకు నిర్వాహకులు సాంకేతిక సాయం అందిస్తున్నారు. ప్లాంట్​ను నెలకొల్పిన 30 రోజుల తర్వాత గ్యాస్ ఉత్పత్తి ప్రారంభమవుతుంది. ఆహార వ్యర్థాల్లో ముఖ్యంగా కూరగాయల ముక్కలు, సేంద్రియ వ్యర్థాలు, వృథాగా పారేసే ఆహారపదార్థాలు, ఇతర తడి వ్యర్థాలను ఇన్ లెట్ ద్వారా ప్లాంట్​లోకి పంపిస్తారు. ఇందులో ఉండే క్రషర్ వీటిని ప్రాసెస్ చేసి ఏనరోబిస్ ప్రక్రియ ద్వారా గ్యాస్​ను విడుదల చేస్తుంది. దానిని స్టవ్​కు అనుసంధానం చేసుకుంటే సరి.

ఇప్పుడిప్పుడే మార్కెట్...

ఇతర ప్లాంట్లతో పోలిస్తే ఇది నూతన సాంకేతికతో రూపొందించామని నిర్వాహకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉత్తర భారత్​లో ఈ సాంకేతికతను ఎక్కువ మంది రైతులు వినియోగిస్తున్నారని.. దక్షిణ భారత్​లో ఇప్పుడిప్పుడే మార్కెట్ ప్రారంభమైందన్నారు. వ్యర్థాల పునర్వినియోగం ద్వారా ప్రకృతికి ఎంతో మేలు జరుగుతుందని వెల్లడించారు.

పర్యావరణానికి మేలు, చెత్త సమస్య తీరుతుంది.. పనిలో పనిగా ఉచితంగా గ్యాస్​ను అందించే ఈ ప్లాంట్​పై​ అవగాహన పెంచాలి. అప్పుడే పర్యావరాణ ప్రయోజనం కలుగుతుంది.

ఇవీ చూడండి:సికింద్రాబాద్ రైల్వేస్టేషన్​లో బ్యాటరీ కార్లు

Intro:TG_SRD_41_16_MLA_VIS_AVB_C1

యాంకర్ వాయిస్...
ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజల ఆకాంక్ష మేరకు పాలన సాగిస్తున్నామని అందువల్లే తిరిగి రాష్ట్రంలో తెరాస పార్టీ అధికారంలోకి వచ్చిందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి గారు రు క్యాంపు కార్యాలయంలో లో అన్నారు

ఈరోజు మెదక్ మండల పరిధిలోని రాజు పల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే గారి సమక్షంలో 30 మంది ఎమ్మెల్యే గారు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు
ఈ సందర్భంగా గా పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు రైతుల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని రైతుబంధు రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టినట్లు చెప్పారు తెలంగాణ అభివృద్ధి తెరాస తోనే సాధ్యం రాష్ట్ర ప్రజలు గత ఎన్నికల్లో 90 స్థానాలు ఎమ్మెల్యేలను భారీ మెజార్టీతో గెలిపించారని చెప్పారు అలాగే సర్పంచ్ ఎన్నికల్లో కూడా అత్యధికంగా తెరాస బలపర్చిన అభ్యర్థి గెలుపొందారు అని తెలిపారు అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇది విజయ దుందుభి మోగించాలని ప్రజలకు పిలుపునిచ్చారు రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే కేంద్ర ప్రభుత్వ నిధులు అవసరమని చెప్పారు కేంద్రం కీలక పాత్ర పోషించాలంటే 16 స్థానాల్లో అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని అలాగే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సభ్యులు లావణ్య రెడ్డి మండల అధ్యక్షులు టిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు

బైట్.... పద్మా దేవేందర్ రెడ్డి.. మెదక్ ఎమ్మెల్యే

Body:విజువల్స్

Conclusion:ఎన్ శేఖర్ మెదక్..9000302217
Last Updated : Mar 16, 2019, 11:13 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.