Bio Asia Summit 2022 : హైదరాబాద్ వేదికగా జీవశాస్త్రం, బయోటెక్నాలజీ, ఔషధ, ఆరోగ్య పరిరక్షణ రంగాలపై బయో ఆసియా అంతర్జాతీయ సదస్సు నిర్వహణకు రంగం సిద్ధమైంది. 24, 25వ తేదీల్లో దృశ్యమాధ్యమంలో జరిగే సదస్సును మంత్రి కేటీ రామారావు ప్రారంభిస్తారు. ప్రపంచ ప్రసిద్ధ సంస్థలు, వాటి అధిపతులు, సీఈవోలు, శాస్త్రవేత్తలు, నిపుణులు, పారిశ్రామికవేత్తలు, ఉన్నతాధికారులు ఇందులో పాల్గొంటారు.
బిల్‌గేట్స్‌తో కేటీఆర్ టాక్..
Bio Asia Summit 2022 in Hyderabad : తొలిరోజు కరోనాపై జరిగే చర్చాగోష్ఠిలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌తో.. కేటీఆర్ ప్రత్యేక చర్చ నిర్వహిస్తారు. రెండోరోజు ఔషధ రంగ పురోగతి, సీఈవోల సదస్సు జరుగుతుంది. కరోనా నియమ నిబంధనలు, నియంత్రణపైనా చర్చిస్తారు. మరో నాలుగు ప్యానళ్ల చర్చాగోష్ఠులూ ఉంటాయి. మొత్తంగా రెండు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో 50 మంది ప్రసంగిస్తారు. రెండు కీలక ప్రసంగాలుంటాయి.
"కరోనా నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య పరిరక్షణ, సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవడం, మానవాళి సంక్షేమానికి బయో ఆసియా సదస్సు దిశానిర్దేశం చేస్తుందన్నారు. వైద్యరంగంలో సాంకేతికత, ఔషధ పరిశ్రమల ఉజ్వల భవిష్యత్తుకు, ప్రపంచస్థాయి జీవశాస్త్రాల కేంద్రంగా ఉన్న హైదరాబాద్ ఖ్యాతిని మరోసారి చాటేందుకు ఇది ఉపకరిస్తుంది".
- కేటీఆర్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి
ఇవీ చదవండి :