హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోని గౌరెల్లి జంక్షన్ నుంచి కొత్తగూడెం రోడ్డును జాతీయ రహదారిగా ప్రకటించినా... ఎన్‌హెచ్ నెంబర్ ఇవ్వలేదని లోక్సభలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కేంద్రం దృష్టికి తీసుకువచ్చారు. డీపీఆర్ పంపినా వెనక్కి వచ్చిందని... జాతీయ రహదారిగా గుర్తించినందున రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు మరమ్మతు పనులు కూడా పట్టించుకోవడం లేదన్నారు.
త్వరగా ఎన్‌హెచ్ నంబర్ కేటాయించి.. రోడ్డు మరమ్మతుకు చర్యలు తీసుకోవాలని కోమటిరెడ్డి కోరారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితో కొన్నేళ్లుగా రహదారి పరిస్థితి అధ్వానంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైజాగ్ పోర్టు, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు హైదరాబాద్ నుంచి ఈ రహదారి 100 కిలోమీటర్ల దూరాన్ని తగ్గించడమే కాకుండా గిరిజన ప్రాంతాల నుంచి వెళ్తోందని గుర్తుచేశారు.
ఇదీ చూడండి: ఎల్ఆర్ఎస్ను సవాల్ చేస్తూ హైకోర్టులో కోమటిరెడ్డి పిటిషన్