ETV Bharat / city

Bhatti Vikramarka in Assembly: 'బడ్జెట్‌ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా లేదు'

author img

By

Published : Mar 9, 2022, 4:33 PM IST

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పద్దు.. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఉద్ఘాటించారు. మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ఆరోపించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర విషయంలో నిజానిజాలను వీలైనంత త్వరగా ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ద్వారా ఎన్ని టీఎంసీల నీళ్లు ఎత్తిపోశారు.. నీరు ఎత్తిపోయడానికి ఎంత విద్యుత్ ఖర్చైంది వంటి వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని భట్టి కోరారు.

Bhatti Vikramarka in Assembly
Bhatti Vikramarka in Assembly

రాష్ట్ర సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా లేదని సీఎల్పీ నేత భట్టివిక్రమార్క అన్నారు. భారీ బడ్జెట్లు పెడుతున్నారు కానీ.. ఖర్చు చేయడం లేదని విమర్శించారు. మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని భారీగా అప్పులపాలు చేశారని ఆరోపించారు.

నిజానిజాలు తేల్చాలి..

సొంత స్థలంలో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తామన్న సర్కార్.. ఇప్పుడు రూ.3 లక్షలకు తగ్గించిందని భట్టి మండిపడ్డారు. నిర్మాణ ఖర్చులు భారీగా పెరిగినందున నిధులు పెంచాలని కానీ తగ్గించడమేంటని ప్రశ్నించారు. ఇంటి నిర్మాణానికి రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్​ హత్యకు కుట్ర విషయంలో నిజానిజాలను ప్రజలకు తెలియజేయాలని కోరారు. ఈ కుట్రలో ప్రమేయం ఉన్న వారెవరో తేల్చాలని అన్నారు.

ధరణితో లాభం కన్నా.. నష్టమే ఎక్కువ

ధరణి పోర్టల్​తో ప్రజలకు మేలు జరుగుతుందని భావించామన్న భట్టి.. దానివల్లే ఎన్నో హత్యలు, ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ధరణి పోర్టల్​ తప్పిదాల వల్ల ఓ బాధితుడు తహశీల్దార్​పై పెట్రోల్ పోసి నిప్పంటి తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపారు. వీలైనంత త్వరగా ధరణి సమస్య పరిష్కరించి ప్రజలకు మేలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఇబ్బడిముబ్బడిగా పెంచారన్న భట్టి విక్రమార్క.. సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సంపద పెరిగిన రాష్ట్రంలో పన్నుల భారం ప్రజలపై మోపితే ఎలా అని సర్కార్​ను ప్రశ్నించారు. సంపదతో పాటు తీసుకున్న అప్పులు.. వాటిని ఎలా ఖర్చు పెట్టారు.. ఖర్చు పెట్టిన వాటితో వచ్చిన లాభం వంటి విషయాలపై ప్రభుత్వం ఓ శ్వేత పత్రం విడుదల చేయాలని సీఎల్పీ భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.

మీ రియాక్షన్ ఏంటి..

"రాష్ట్రం సాధించుకున్నదే నదీ జలాల గురించి. అలాంటి నదీజలాలు ప్రజలకు అందుబాటులోకి లేకపోతే స్వరాష్ట్ర సాధన వృధాయే కదా. తరచూ వార్తల్లో చూస్తున్నాం.. రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ కేఆర్​ఎంబీ, జీఆర్​ఎంబీ, అపెక్స్​ పరిధిలోకి వెళ్తాయని.. ప్రాజెక్టులన్నింటిని అవే కంట్రోల్ చేస్తాయని.. గోదావరిపై నిర్మిస్తున్న కొన్ని ప్రాజెక్టులకు అనుమతి లేవని... అవి తక్షణమే ఆపివేయాలనే వార్తలు తరచూ చూస్తున్నాం. కానీ వీటిపై ప్రభుత్వ స్పందన మాత్రం కనిపించడం లేదు. మీరు వీటిపై స్పందించి మాకు ఓ క్లారిటీ ఇవ్వండి. 35 లక్షల ఎకరాలకు కాళేశ్వరం ద్వారా నీళ్లు అందిస్తున్నామని చెప్పారు. కాళేశ్వరం నీళ్లు మేడిగడ్డ నుంచి అన్నారానికి.. అన్నారం నుంచి సుందిళ్లకు.. సుందిళ్ల నుంచి శ్రీపాద ఎల్లంపల్లిలోకి ఎన్ని టీఎంసీల నీళ్లు ఎత్తిపోశారు. ఆ నీరు ఎత్తిపోయడానికి ఎంత విద్యుత్ ఖర్చు చేశారు. ఆ విద్యుత్​కు ఎంత ఖర్చు అయింది వంటి వివరాలను ప్రజలకు తెలియజేయండి. ఖమ్మం జిల్లాకు సంబంధించి అతి తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ఇందిరా, రాజీవ్ సాగర్​లను సీతారామ, సీతమ్మ అంటూ కొత్త పేర్లు పెట్టి రీడిజైన్​ పేరుతో నిధులు పెంచారు. కానీ ఇప్పటి వరకు ఆ ప్రాజెక్టులు పూర్తి కాలేదు. చుక్క నీరు మా జిల్లాకు రాలేదు."

- భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత

బడ్జెట్​పై భట్టి విక్రమార్క రియాక్షన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.