ETV Bharat / city

తెరాసకు మద్దతుపై సీపీఐ పునరాలోచించాలి: భట్టి - bhatti on rtc

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న కార్మికుల డిమాండ్​ న్యాయమైనదేని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు. 48 వేల మంది కార్మికులను తొలగిస్తునట్లు ప్రకటించడం నియంతృత్వమేనని పేర్కొన్నారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయమనడం న్యాయమైనదే: భట్టి
author img

By

Published : Oct 7, 2019, 3:35 PM IST

దసరా సందర్భంగా ఆర్టీసీ కార్మికులకు గత ప్రభుత్వాలు బోనస్ ఇచ్చేవని.. కేసీఆర్‌ మాత్రం ఉద్యోగాలు తొలగిస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. 48వేల మంది కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించడం నియంతృత్వమేనని మండిపడ్డారు. దేశ చరిత్రలోనే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం మొదటిసారిగా పేర్కొన్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీలనే.. నెరవేర్చాలనే కార్మికులు కోరుతున్నట్లు భట్టి తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరడం న్యాయమైనదేనని అభిప్రాయపడ్డారు. ఆర్టీసీని ప్రైవేటు పరం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఆర్టీసీ నష్టాలకు ప్రభుత్వ నిర్ణయాలే కారణమన్నారు. కార్మికుల పక్షపాతిగా చెప్పుకునే సీపీఐ.. హుజూర్​నగర్‌ ఉపఎన్నిక సందర్భంగా ఇచ్చిన మద్దతుపై పునరాలోచించాలని సూచించారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయమనడం న్యాయమైనదే: భట్టి

ఇవీచూడండి: 'ఆర్టీసీ ఉద్యోగులకు భాజపా అండగా ఉంటుంది'​

TG_Hyd_32_07_CLP_Bhatti_On_Govt_AB_3038066 Reporter: Tirupal Reddy Script: Razaq Note: ఫీడ్ సీఎల్పీ కార్యాలయం OFC నుంచి వచ్చింది. ( ) కేసీఆర్ ప్రభుత్వంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆర్టీసీలో 48వేల మంది కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించడం నియంతృత్వమేనని మండిపడ్డారు. గత ప్రభుత్వాలు దసరాకు కార్మికులకు బోనస్ ఇచ్చేవని....కేసీఆర్‌ మాత్రం ఉద్యోగాలు తొలగిస్తున్నారని అగ్రహం వ్యక్తం చేశారు. దేశ చరిత్రలోనే ఇలాంటి నిర్ణయాలు మొదటిసారిగా పేర్కొన్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే కార్మికులు కోరుతున్నట్లు భట్టి తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరడం న్యాయమైనదేనన్నారు. ఆర్టీసీని ప్రైవేటుపరం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఆర్టీసీ నష్టాలకు ప్రభుత్వ నిర్ణయాలే కారణమన్నారు. ఆర్టీసీ వాడే డిజిల్‌కు రాష్ట్ర ప్రభుత్వం అధికంగా వ్యాట్ విధిస్తోందని...ఇది ఆ సంస్థపై సంవత్సరానికి 400కోట్ల భారం పడుతుందని భట్టి వివరించారు. ఆర్టీసీ ఆస్తులను తన వారికి అప్పజేప్పేందుకు కేసీఆర్ కుట్ర పూరితంగా వ్యవహారిస్తున్నారని ఆరోపించారు. కార్మికుల పక్షపాతిగా చెప్పుకునే సీపీఐ హుజూర్ నగర్‌ ఉప ఎన్నికపై ఇచ్చిన మద్దతుపై పునరాలోచించాలని సూచించారు. బైట్: భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.