ETV Bharat / city

బతుకమ్మ చీరల పంపిణీకి సిద్ధమవుతున్న అధికారులు.. అప్పటిలోగా అన్ని జిల్లా కేంద్రాలకు! - బతుకమ్మ పండగ తెలంగాణ

BATHUKAMMA SAREES 2022: రాష్ట్రంలో అతిపెద్ద పూల పండుగ.. తెలంగాణ ఆడపడుచుల పండుగ బతుకమ్మ. మహిళలు రంగు రంగుల పూలతో అందంగా అలంకరించి బతుమ్మను తయారు చేస్తారు. వీరు ఘనంగా ఈ పండుగను జరుపుకుంటారు. అయితే ఈ పండుగకు ప్రభుత్వం చీరలను పంపిణీ చేయడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఈసారి సైతం బతుకమ్మ చీరలను పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

Bathukamma sarees
బతుకమ్మ చీరలు
author img

By

Published : Sep 2, 2022, 9:03 AM IST

Bathukamma festival: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడపడుచులకు అందిస్తున్న బతుకమ్మ చీరల పంపిణీకి అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు చీరలు జిల్లా కేంద్రానికి చేరుకుంటున్నాయి. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే బ‌తుక‌మ్మ పండుగను ప్రతి ఒక్క ఆడ‌బిడ్డ తార‌త‌మ్య బేధం లేకుండా ఆనందంగా పండుగ జరుపుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వమే చీరల పంపిణీని చేపడుతుంది. ఈనెల 15వ తేదీ లోపు అన్ని జిల్లా కేంద్రాలకు చీరలను పంపిణీ చేసేందుకు అధికారులు కసరత్తులు ప్రారంభించారు.

రాష్ట్ర ప్రభుత్వం ఈసారి బతుకమ్మ పండగను అంగరంగ వైభవం నిర్వహించడానికి పూనుకుంది. తెలంగాణ సాంప్రదాయం ఉట్టిపడేలా మహిళలకు అందమైన చీరలను పంపిణీ చేస్తుంది. అందుకుగానూ ఈ ఏడాది 340 కోట్ల రూపాయల వ్యయంతో 1కోటి 18 లక్షల చీరలను ప్రత్యేకంగా తయారు చేయిస్తున్నారు. సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లితో పాటు జగిత్యాల జిల్లాలో నేతన్నలతో బతుకమ్మ చీరల తయారీ కొనసాగుతోంది. ఈసారి 17 కొత్త వర్ణాలతో 17 డిజైన్స్‌లతో కలిపి మొత్తం 240 డిజైన్స్‌లో ఈసారి బతుకమ్మ చీరల తయారు చేయిస్తున్నారు. గత ఏడాది 96 లక్షల చీరల పంపిణీ చేశారు. ఈ ఏడాది 10 వేల మంది చేనేత కార్మికులతో ఆరు నెలల నుంచి కోటి 18 లక్షల చీరలు తయారు చేయిస్తున్నారు. వీటిని బతుకమ్మ పండుగ ప్రారంభంకు ముందే అర్హులైన ప్రతి ఒక్కరికి పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకోంది.

ఇప్పటికే 50 శాతం చీరలు జిల్లా కేంద్రాలకు అధికారులు తరలించారు. ఈనెల 15 లోపు అన్ని జిల్లా కేంద్రాలకు చీరల పంపిణీ చేసేందుకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు. బతుకమ్మ పండుగ ప్రారంభానికి ముందే అర్హులైన ప్రతి ఒక్కరికి పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పౌరసరఫరాల దుకాణాలు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఈ చీరలను అందించనున్నారు. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లా మహిళల కోసం 9 గజాల చీరలను ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు. వెండి, బంగారు అంచుతోపాటు మరో 10 రంగులతో చీరల అంచులను నేతన్నలు నేస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.