దేశ విదేశాల్లో బతుకమ్మ సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉగాండా రాజధాని కంపాలా (Bathukamma in Uganda)లో బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించారు. "తెలంగాణా అసోసియేషన్ ఆఫ్ ఉగాండా" ఆధ్వర్యంలో 'తిరుమల తిరుపతి దేవస్థానం- ఉగాండా' ప్రాంగణంలో ఘనంగా బతుకమ్మ పండుగ సంబురాలు చేపట్టారు. ఈ పండుగకి ప్రాంతాలకతీతంగా చాలా మంది మహిళలు , పురుషులు, పిల్లలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మహిళలు బతుకమ్మ పాటలు పాడుకుంటూ..ఆటలాడుతూ... తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పారు. రెండు గంటల పాటు సాగిన ఈ ఆటపాటల అనంతరం... బతుకమ్మలను పక్కనే ఉన్న కొలనులో ఉంచి పోయిరావమ్మ... బతుకమ్మ అంటూ వీడ్కోలు పలికారు.
ఘనంగా జరిగిన బతుకమ్మ పండుగ సంబరాలను... తెలంగాణ సంస్కృతిని స్థానికులు తిలకించి ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. మున్ముందు జరిగే సంబురాలలో తాము కూడా పాలుపంచుకుంటామని తెలిపారు. వచ్చే ఏడాది నుంచి బతుకమ్మ సంబురాలను మరింత ఘనంగా నిర్వహిస్తామని నిర్వాహకులు పేర్కొన్నారు. రెండు రోజులు కాకుండా వారం రోజుల పాటు ఈ పండగ జరుపుకునేలా ఏర్పాట్లు చేస్తామని అసోసియేషన్ సభ్యులు తెలిపారు.
ఇదీ చదవండి: goddess with Currency notes: ఆ అమ్మవారిని ఎన్నికోట్ల రూపాయలతో అలంకరించారో తెలుసా?