ETV Bharat / city

ట్యాంక్​బండ్​పై బతుకమ్మ సంబురాలు.. మారుమోగిన ఉయ్యాల పాటలు..

హైదరాబాద్ వాసులు ట్యాంక్​బండ్​పై ఐదోరోజు అట్ల బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిపారు. సండే ఫన్​డే సందర్భంగా నగరవాసులు కుటుంబ సమేతంగా ట్యాంక్‌బండ్‌ బాటపట్టారు. సందర్శకుల తాకిడితో హుస్సేన్​సాగర్​ పరిసరాలు రద్దీగా మారాయి. సందర్శకుల కోసం అధికారులు ఆహ్లాదకరమైన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.

Bathukamma celebrations At tank bund
Bathukamma celebrations At tank bund
author img

By

Published : Oct 10, 2021, 8:50 PM IST

హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌ అందాలను చూసేందుకు ప్రభుత్వం... ప్రతి ఆదివారం సాయంత్రం కేవలం నడక దారినే ట్యాండ్ బండ్​పైకి అనుమతిస్తోంది. నడకదారిన వచ్చే సందర్శకులు, పర్యాటకులకు ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ట్యాంక్‌బండ్‌ పైకి వచ్చే ట్రాఫిక్‌ను దారి మళ్లీంచారు. ట్యాంక్ బండ్​పై ప్రతి వారం ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు.

ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా.. ఇవాళ ట్యాంక్‌బండ్​పై బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మహిళలు, యువతులు పెద్దఎత్తున పాల్గొని బతుకమ్మ ఆటలు ఆడారు. ఐదోరోజు సందర్భంగా అట్లబతుకమ్మ వేడుకల్లో భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రంగుల రంగుల బతుకమ్మల చుట్టూ.. ఉయ్యాల పాటలతో ఉత్సాహంగా ఆటలు ఆడుకున్నారు. సెలవుదినాన్ని ఆస్వాదించేందుకు వచ్చిన వాళ్లు కూడా బతుకమ్మ సంబురాల్లో పాల్గొని సంబురపడ్డారు. ప్రత్యేక వేషాదారణలో యువతుల కోలాట నృత్యాలు అందరిలో ఉత్సాహాన్ని నింపాయి. చిన్నాపెద్దా తేడా లేకుండా.. ఎంతో సందడిగా బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు.

లేజర్​షోలు సందర్శకులను ఆహ్లాదపరచడంతో ఆకట్టుకున్నాయి. సాయంత్రం వేళ ఆహ్లాదకరంగా ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన సండే ...ఫన్‌ కార్యక్రమాలు హుషారెత్తించాయి. ట్యాంక్‌బండ్‌ అందాలను తిలకించేందుకు వచ్చిన వారికి హెచ్‌ఎండీఏ అధికారులు మొబైల్‌ టాయిలెట్స్‌...అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచారు. యువతను ఆకట్టుకునేందుకు గేమింగ్ జోన్ ఏర్పాటు చేశారు. సందర్శకులకు అధికారులు మొక్కలు పంపిణీ చేశారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.