ETV Bharat / city

సంక్షిప్త సందేశానికి స్పందిస్తే... ఖాతా ఖాళీ

author img

By

Published : Dec 19, 2019, 5:34 AM IST

మీరు ఫలానా ఏటీఎంలో నగదు విత్‌డ్రా చేసుకున్నారు. చేసుకుంది మీరు కాదంటే వెంటనే ఈ నంబర్‌కు ఫోన్ చేయండి. తిరిగి మీ ఖాతాలో నగదు జమచేస్తాం. ఇలాంటి సందేశాలకు స్పందిస్తే అంతే సంగతులు. సంక్షిప్త సందేశాలకు స్పందిస్తే... సైబర్‌ నేరగాళ్లు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు.

సంక్షిప్త సందేశానికి స్పందిస్తే... ఖాతా ఖాళీ
సంక్షిప్త సందేశానికి స్పందిస్తే... ఖాతా ఖాళీ

సైబర్ నేరాలపై పోలీసులు ఎంత నిఘా పెట్టినప్పటికీ... నేరగాళ్లు ఎప్పటికప్పడు తమ పంథా మార్చుకుంటూ కొత్త తరహా మోసాలకు పాల్పడున్నారు. అమాయకుల ఖాతాల్లోంచి సొమ్ము లూటీ చేస్తూనే ఉన్నారు. తాజాగా మరో కొత్తరకం మోసం బయట పడింది. ప్రధానంగా ఆంధ్రాబ్యాంక్ ఖాతాదారులను లక్ష్యంగా చేసుకుని... చరవాణులకు సంక్షిప్త సందేశాలు పంపుతున్నారు. మీ ఖాతా నుంచి నగదు విత్ డ్రా చేసుకున్నారు. మీరు చేసుకోనట్లైతే 9298112345 నంబరుకు సంక్షిప్త సందేశం పంపించండి అని మేసేజ్‌ చేస్తున్నారు. మీ కార్డు బ్లాక్ చేసేందుకు 7679751875 కు వెంటనే ఫోన్ చేయండి అని సందేశాలు పంపుతున్నారు.

లింకు తెరిస్తే... అంతే

సందేశంలో ఉన్న నంబర్లకు ఫోన్‌ చేస్తే... అంతే నేరగాళ్లు తమ పని మొదలుపెడుతున్నారు. అప్పటికే పూర్తి వివరాలు తెలుసుకొని... బ్యాంక్ అధికారుల్లా మాట్లాడి నమ్మిస్తారు. మీకో లింకు పంపుతున్నాం.. ఆ లింకు తెరిచి అందులో వివరాలు నమోదు చేస్తే... అరగంటలో మీ ఖాతాలో నగదు జమ అవుతుందని చెబుతారు. ఆ లింక్‌లో బాధితుడి అంతర్జాల ఆధారిత ఖాతాకు సంబంధించిన UPI ఐడీ ఉంటుంది. దీని ద్వారా బాధితుడి బ్యాంక్ ఖాతాల్లో నగదును తస్కరిస్తారు. బాధితులు తమ ఖాతాల్లో నగదు విత్‌డ్రా అయిందని తెలుసుకుని మాట్లాడే లోపు ఫోన్ స్విచ్ఛాఫ్ చేస్తున్నారు.

మహిళలు, వృద్ధులే లక్ష్యంగా...

ఆంధ్రాబ్యాంక్‌లో అంతర్జాల ఆధారిత బ్యాంక్ ఖాతాదారుల వివరాలు సైబర్ నేరస్థులు... పొరుగు సేవల విభాగంలో పనిచేస్తున్న కిందిస్థాయి సిబ్బందికి డబ్బులిచ్చి సేకరిస్తున్నారు. రోజుకు దాదాపు 200 మంది చరవాణులకు సందేశాలు పంపి మోసాలకు పాల్పతున్నారు. త్వరగా స్పందిస్తారని... మహిళలు, వృద్ధులను లక్ష్యంగా చేసుకుంటున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. బాధితులు తెలిపిన వివరాల ఆధారంగా బిహార్, ఝార్ఖండ్‌కు చెందినవారు ఈ నేరాలు చేస్తున్నారని గుర్తించారు. సంక్షిప్త సందేశాలు చూసిన వెంటనే బ్యాంక్ అధికారులు, సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.

ఇదీ చూడండి: చిరుద్యోగి మంచితనం.. ఉన్నతాధికారి స్వార్థం

TG_HYD_05_19_BANK_LINK_THEIFT_PKG_3182400 రిపోర్టర్ నాగార్జున note: సైబర్ నేరగాళ్ళు పంపిన సందేశం ఫోటో డెస్క్ వాట్సప్ కి పంపాము ()మీరు ఫలానా ఏటీఎం నుంచి 20వేలు నగదు విత్ డ్రా చేసుకున్నారు...విత్ డ్రా చేసుకుంది మీరు కాదంటే వెంటనే ఈ నంబర్‌కు ఫోన్ చేయండి...మీ నగదు మీ బ్యాంక్ ఖాతాల్లో జమచేస్తాం..ఇలాంటి సందేశాలకు స్పందిస్తే అంతే సంగతులు..ఇలా బ్యాంకుల సందేశాల పేరుతో సైబర్ నేరస్థులు సరికొత్త మోసాలకు తెరలేపారు సంక్షిప్త సందేశాలతో సైబర్ నేరస్తుల సరికొత్త మాయాజాలం చేస్తున్నారు. స్పందించిన వారి ఖాతాల్లోంచి లక్షల్లో ఖాళీ చేస్తున్నారు.. వాయిస్ సైబర్ నేరాలపై సైబర్ క్రైం పోలీసుల ఎంత నిఘా పెట్టానా నేర గాళ్ళు మాత్ర కొత్త పంథాలతో అమాయకుల సొమ్మును వారి ఖాతాల్లోనుంచి లూఠీ చేస్తూనే ఉన్నారు.తాజాగా మరో కొత్తరకం మోసం బయట పడింది. ప్రధానంగా ఆంధ్రాబ్యాంక్ ఖాతాదారులను లక్ష్యంగా చేసుకుని వారి చరవాణులకు సంక్షిప్త సందేశాలను పంపుతున్నారు.ఇలా 20 రోజుల నుంచి కొత్త తరహా నేరాలు చేస్తున్నారు. ఆంధ్రాబ్యాంక్ పేరుతో సంక్షిప్త సందేశాలు పంపి మీరు 20వేల నగదు విత్ డ్రా చేసుకున్నారు. మీరు చేసుకోనట్లైతే 9298112345 నంబరు సంక్షిప్త సందేశం పంపించండి...మీ కార్డు బ్లాక్ చేసేందుకు 7679751875 వెంటనే ఫోన్ చేయండి అంటూ క్రింద అంధ్రాబ్యాంక్ అంటూ సంక్షిప్త సందేశం పంపుతున్నారు.ఇది చూసి కంగారు పడిన బాధితులు సైబర్ నేరస్థులు సూచించిన ఫోన్ నంబర్లకు ఫోన్ చేసిన వెంటనే సైబర్ నేరస్థులు స్పందిస్తున్నారు. అప్పటికే వారి వివరాలను తెలుసుకున్న సైబర్ నేరస్థులు అచ్చం బ్యాంక్ అధికారుల్లా మాట్లాడి మీరు పోగుట్టుకున్న నగదు ఖాతాలో జమ చేస్తాం నమ్మిస్తారు. అందుకు మీకో లింకు ను పంపుతున్నాం..లింకును తెరిచి అందులో వివరాలు నమోదు చేస్తే చాలు...అరగంటలో మీ ఖాతాలో నగదు జమౌతుందని చెబుతారు..నేరస్థులు పంపించిన లింక్ లో బాధితుడి అంతర్జాల ఆధారిత ఖాతాకు సంబంధించిన యూపీఐ ఐడీ ఉంటుంది దీన ద్వారా బాధితుడి బ్యాంక్ ఖాతాల్లోని నగదును సైబర్ నేరస్థులు వారి ఖాతాల్లోకి జమ చేసుకుంటున్నారు. బాధితులు తమ ఖాతాల్లో నగదు విత్ డ్రా అయ్యిందని తెలుసుకుని మాట్లాడేలోపు నేరస్థులు తమ ఫోన్ నంబర్లను స్విచ్ఛాఫ్ చేస్తున్నారు. వాయిస్ ప్రధానంగా మహిళలు...వృద్దులను లక్ష్యంగా చేసుకుని......అంతర్జాల ఆధారిత ఖాతాలు, వారి ఫోన్ నంబర్లను తెలుసుకున్న తర్వాత సైబర్ నేరస్థులు వారికి మాత్రమే ఎక్కువాగా సంక్షిప్త సందేశాలను పంపుతున్నారు. వీరైతే సంక్షిప్త సందేశాలు వచ్చిన వెంటనే స్పందిస్తారన్న ముందస్తు అంచనాతో ఇలా చేస్తున్నారని పోలీసులు భావిస్తున్నారు. బ్యాంక్ అధికారులను సంప్రదించి ఇది మోసమని తెలుసుకుని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయిస్తున్నారు . బాధితులు తెలిపిన వివరాల ఆధారంగా బిహార్ , ఝార్ఖండ్ రాష్ట్రాల్లో ఉంటున్న నేరస్థులు ఈ నేరాలు చేస్తున్నారని పోలీస్ అధికారులు గుర్తించారు . సంక్షిప్త సందేశాలను చూసిన వెంటనే బ్యాంక్ అధికారులను సంప్రదించాలని లేదా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని వివరించారు. ఆంధ్రాబ్యాంక్ లో అంతర్జాల ఆధారిత బ్యాంక్ ఖాతాలున్న వారి వివరాలను సైబర్ నేరసులు పొరుగు సేవల విభాగంలో పనిచేస్తున్న కిందిస్థాయి వారికి డబ్బులిచ్చి అనంతరం ఆయా ఖాతాదారుల వివరాలను తెలుసుకుని రోజుకు 200 మంది చరవాణులకు ఆంధ్రాబ్యాంక్ నుంచి పంపినటే సందేశాలు పంపి ఇలా మోసాలకు పాల్పతున్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.