ETV Bharat / city

హైదరాబాద్​లో మరో ప్లైఓవర్​ ప్రారంభం... ఇక ట్రాఫిక్​ చిక్కులు దూరం - traffic update

హైదరాబాద్​ మహానగరంలో ట్రాఫిక్​చిక్కులు తీర్చేందుకు మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తోంది. బైరామల్​గూడ జంక్షన్​లో నిర్మించిన కుడివైపు ఫ్లైఓవర్​ను మంత్రి కేటీఆర్​ ఇవాళ ప్రారంభించనున్నారు. ఫ్లైఓవర్ నిర్మాణానికి దేశంలోనే మొదటి సారి ప్రత్యేక సాంకేతికతను వినియోగించారు.

bairamalguda flyover opening today
bairamalguda flyover opening today
author img

By

Published : Aug 10, 2020, 3:16 AM IST

హైదరాబాద్​లో మరో ప్లైఓవర్​ ప్రారంభం... ఇక ట్రాఫిక్​ చిక్కులు దూరం

హైదరాబాద్​లో రోజురోజుకూ ట్రాఫిక్​ భారీగా పెరిగిపోతోంది. రోడ్లపై రద్దీతో వాహనాదారులు పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఈ పరిస్థితుల్లో ట్రాఫిక్​ చిక్కులు తీర్చేందుకు ప్రభుత్వం వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టును ప్రారంభించింది. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు, అండర్​ పాసులను నిర్మిస్తోంది. ఇప్పటికే పలు పైవంతెనలు, అండర్ పాస్​లు అందుబాటులోకి రాగా.... ఇప్పుడు బైరామల్​గూడ చౌరస్తాలో ఫ్లైఓవర్​ను మంత్రి కేటీఆర్​ ప్రారంభించనున్నారు. ఎస్సార్​డీపీ ప్యాకేజీ-2లో భాగంగా రూ. 26.45 కోట్ల అంచనా వ్యయంతో కుడివైపు ఫ్లైఓవర్ నిర్మించారు.

ప్రత్యేక సాంకేతికతతో నిర్మాణం...

బైరామల్ గూడ జంక్షన్​లో నిర్మించిన కుడివైపు ఫ్లైఓవర్ నిర్మాణంలో ప్రత్యేక సాంకేతికతను వినియోగించారు. ఈ పైవంతెనతో బైరామల్ గూడ జంక్షన్, సాగర్​రోడ్ జంక్షన్​పై ఒత్తిడి తగ్గనుంది. బైరామల్​గూడ జంక్షన్​లో రద్దీ వేళల్లో గంటకు దాదాపు 12 వేల వాహనాలు ప్రయాణిస్తాయి. సికింద్రాబాద్ నుంచి ఓవైసీ జంక్షన్​కు, శ్రీశైలం వెళ్లే వాహనదారులకు కూడా ఈ ఫ్లైఓవర్ ఉపయోగకరంగా మారనుంది.

14 పనుల్లో ఆరు పూర్తి...

ప్రభుత్వం ఎస్సార్​డీపీ కింద చేపట్టిన 14 పనులలో ఆరు పనులు పూర్తయ్యాయి. ప్యాకేజీ-2లో భాగంగా రూ.448 కోట్ల అంచనా వ్యయంతో ఎల్బీనగర్​ చౌరస్తా, బైరమాల్​గూడ, నాగోల్​ కామినేని చౌరస్తా, చింతల్​కుంట వద్ద పైవంతెనలు, అండర్​పాసుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వీటిలో ఇప్పటివరకు ఎల్బీనగర్ జంక్షన్​లో దిల్​సుఖ్​ నగర్​ నుంచి హయత్​నగర్​ వైపు వెళ్లేందుకు ఫ్లై ఓవర్ అందుబాటులోకి వచ్చింది. కామినేని జంక్షన్​లో కుడి, ఎడమ ఫ్లైఓవర్లు ప్రారంభమయ్యాయి. ఎల్బీనగర్, చింతల్​కుంట అండర్​పాసులపైన వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇప్పుడు బైరామల్​గూడ చౌరస్తాలో పైవంతెన ప్రారంభానికి సిద్ధమైంది. ఇదే జంక్షన్​లో మిగిలిన పనులు కూడా కొనసాగుతున్నాయి.

ఇదీ చదవండి: కాంగ్రెస్​ వర్గీయుల బాహాబాహీ.. ఒకరిపై ఒకరి కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.