ETV Bharat / city

Telangana assembly sessions: ఈనెల 15 వరకు అసెంబ్లీ బడ్జెట్​ సమావేశాలు - తెలంగాణ బడ్జెట్​ సమావేశాలు

Telangana assembly sessions: ఏడు రోజుల పాటు శాసనసభ బడ్జెట్​ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు బీఏసీ నిర్ణయం తీసుకొంది. మరిన్ని ఎక్కువ రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని మజ్లిస్​, కాంగ్రెస్ సభ్యులు కోరినా... కేవలం 7 రోజుల నిర్వహణకే ప్రభుత్వం మొగ్గు చూపింది.

TELANGANA ASSEMBLY BUDGET SESSION
BAC
author img

By

Published : Mar 7, 2022, 3:43 PM IST

Updated : Mar 7, 2022, 4:43 PM IST

Telangana assembly sessions: ఏడు రోజులపాటు అసెంబ్లీ బడ్జెట్​ సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు అసెంబ్లీ సమావేశాల నిర్వహణలో భేటీ అయిన బీఏసీ నిర్ణయం తీసుకొంది. బీఏసీ సమావేశంలో మంత్రులు హరీశ్​రావు, ప్రశాంత్​రెడ్డి, కొప్పుల ఈశ్వర్​, గంగుల కమలాకర్​,ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ, సీఎల్పీ భట్టి విక్రమార్క పాల్గొన్నారు.

ఈనెల 15 వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈనెల 8, 13 వ తేదీల్లో అసెంబ్లీ సెలవు ఉంటుందని బీఏసీ తెలిపింది. అయితే మరిన్ని ఎక్కువ రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని మజ్లిస్​, కాంగ్రెస్ సభ్యులు కోరారు. కానీ ప్రభుత్వం మాత్రం 7 రోజుల పాటు నిర్వహణకే మొగ్గు చూపింది.

శాసనమండలిలో..

శాసనమండలిలో ఈనెల 10న బడ్జెట్‌పై సాధారణ చర్చ, ప్రభుత్వ సమాధానం, ఈనెల 15న ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చించాలని బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు. శాసనమండలికి రేపు, ఎల్లుండి సెలవు ఇస్తున్నట్లు తెలిపారు.

ఇవీచూడండి:

Last Updated : Mar 7, 2022, 4:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.