హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు అజారుద్దీన్, టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా.. ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిశారు. తమ ఇంట్లో జరిగే శుభకార్యానికి హాజరుకావాలని సీఎంను ఆహ్వానించారు. అజార్ కుమారుడు అసదుద్దీన్, సానియా సోదరి ఆనమ్ మీర్జాల వివాహ విందు ఈ నెల 12వ జరగనుంది. వేడుకకు హాజరుకావాలని ఇరు కుటుంబాల వారు ముఖ్యమంత్రిని ఆహ్వానించారు.
ఇవీచూడండి: మీ ఒంట్లో.. నేనుంటేనే.. మీరు ఓకే !