'ఆటోవాలాలకు.. దిల్లీ ప్రభుత్వం తరహా సాయం చేయండి' - autos remain stoped in telangana
ఆటో బయటకు తీస్తేనే.. వారి పూట గడిచేది. అలాంటిది 38 రోజులుగా ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఫలితంగా ఆటోవాలాల జీవితాలు దుర్భరంగా మారిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు ఆరు లక్షలకు పైగా ఆటోలున్నాయి... పరోక్షంగా వారిపై మరో ఆరులక్షల కుటుంబాలు ఆధారపడ్డాయి. ప్రస్తుతం వారంతా.. పస్తులతో నెట్టుకొస్తున్నారు. ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు. దిల్లీ ప్రభుత్వం తరహాలో సాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఆటో డ్రైవర్ల అవస్థలపై తెలంగాణ ఆటో డ్రైవర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశంతో ఈటీవీ భారత్ ముఖాముఖి...