ETV Bharat / city

ఇస్తినమ్మా వాయనం.. పుచ్చుకుంటినమ్మా వాయనం! - అట్లతద్దివిశేషాలు

సంప్రదాయలు పాటించడంలో తెలుగువాళ్లు ముందుంటారు. అలాంటి సంప్రదాయ పండుగల్లో ఒకటైన అట్లతద్ది నేడు.  ఇది ఆశ్వయుజ బహుళ తదియనాడు జరుపుతారు. ఈ పండగ చేయడం వల్ల గౌరీదేవీ అనుగ్రహంతో అమ్మాయిలకు గుణవంతుడైన భర్త లభిస్తాడని, పెళ్లైన మహిళలకు శుభం కలుగుతుందని విశ్వాసం.

ఇస్తినమ్మా వాయనం.. పుచ్చుకుంటినమ్మా వాయనం!
author img

By

Published : Oct 16, 2019, 11:25 AM IST

Updated : Oct 16, 2019, 11:48 AM IST

ఇస్తినమ్మా వాయనం.. పుచ్చుకుంటినమ్మా వాయనం!

అట్లతద్దె లేదా అట్ల తదియగా పిలువబడే ఈ పండుగ తెలుగువారి ముఖ్యమైన పండుగలలో ఒకటి. "అట్లతద్దె ఆరట్లు.. ముద్దపప్పు మూడట్లు" అంటూ ఆడపడుచులు, బంధువులకు ఇరుగు పొరుగువారికి వాయినాలివ్వటం ఆనవాయితీ. ఆ రోజు సాయంత్రం వాయినాలు, నైవేద్యాలు పూర్తి చేసుకొని గోపూజకు వెళ్తారు. అటునుంచి చెరువులు, కాలువలలో దీపాలను వదిలి, చెట్లకు ఊయలలు కట్టి ఊగుతారు.

11 అట్లు కూడా ఇస్తారు!

ఆశ్వయుజ బహుళ తదియనాడు వచ్చే అట్లతద్దె పండుగ రోజున సూర్యోదయానికి ముందే లేచి స్నానమాచరించి, ఉపవాసముండాలి. ఇంట్లో తూర్పుదిక్కున మంటపం ఏర్పాటు చేసి గౌరీదేవి పూజ చేయాలి. ధూప, దీప, నైవేద్యాలు పెట్టి, వినాయక పూజ తర్వాత, గౌరీ స్తోత్రము, శ్లోకాలు, పాటలు పాడటం చేయాలి. సాయంత్రం చంద్ర దర్శనం తర్వాత తిరిగి స్నానం చేసి మళ్లీ గౌరీ పూజచేసి, 10 అట్లు నైవేద్యంగా పెట్టాలి. ముత్తైదువులకు అలంకారం చేసి 10 అట్లు, 10 ఫలాలు వాయనంగా సమర్పించాలి. అట్లతద్దె నోము కథను చెప్పుకొని, అక్షతలు వేసుకోవాలి. ప్రాంతపు ఆనవాయితీని బట్టి 11 అట్లుకూడా ఇస్తారు.

అట్లతద్ది విశిష్ఠతపై ఓ కథ..

పూర్వం ఒక మహారాజుకు కుమార్తె ఉండేది. ఆమె పేరు కావేరి. కావేరి తన తల్లి ద్వారా అట్లతద్దె వ్రత మహిమను తెలుసుకుని తన రాజ్యంలో ఆమె స్నేహితురాళ్లైన మంత్రి కూతురు, సేనాపతి కూతురు, పురోహితుని కూతురుతో కలిసి చంద్రోదయ ఉమావ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరించింది. తోటి మంత్రి, సేనాపతి, పురోహితుడి కూతుళ్లకు వివాహ వయస్సు రాగానే నవయవ్వనులైన అందమైన భర్తలతో వివాహం జరిగింది. దీంతో మహారాజు.. అమ్మాయి స్నేహితురాళ్లకు వివాహాలు జరిగిపోవుచున్నవని తలచి తన కుమార్తెకు వివాహ ప్రయత్నాలు చేయడం ప్రారంభించారు. కావేరికి యవ్వనులు గాకుండా వృద్ధులైన వారే పెండ్లికుమారులుగా వచ్చేవారు.

మహారాజు ప్రయత్నాలన్నీ విఫలం కావడం చూసిన రాకుమార్తె కావేరి కలతచెంది.. రాజ్యంను వదిలి సమీప అరణ్యములో ఘోర తపస్సు చేసింది. ఒకరోజు పార్వతీ పరమేశ్వరులు కావేరీకి ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమనగా..! కావేరి తన అట్లతద్దె వ్రతాచరణ చేసినా ఫలితం దక్కలేదని.. నా వ్రతములో ఏదైనా దోషమేమిటని? ప్రశ్నిస్తూ.. దుఃఖించింది.

అంతటితో పార్వతీపరమేశ్వరులు ఓ సౌభాగ్యవతి.. ఇందులో నీ దోషము ఏ మాత్రం లేదు. నీవు ఆ అట్లతద్దె నోచే సమయంలో ఉపవాసదీక్షకు తట్టుకోలేక సొమ్మసిల్లి పడిపోగా, విషయమంతా నీ తల్లిద్వారా తెలుసుకున్న నీ సోదరులు ఒక ఇంద్రజాల విద్యను ప్రదర్శించి అద్దముగుండా నీకు చంద్రునిని చూపించినారు.

నీవు ఉపవాస దీక్షను విరమించినావు. ఆ వ్రత భంగమే ఇదని ఆది దంపతులు వివరించారు. నీ సోదరులకు నీపై గల వాత్సల్యముతో అలా చేశారని, ఇందులో నీవు దుఃఖించవలసిందేమీ లేదని చెప్పారు. వచ్చే ఆశ్వయుజ బహుళ తదియనాడు విధివిధానంగా వ్రతమాచరించు. నీ కోరిక తప్పక నెరవేరుతుందని కావేరిని ఆశీర్వదించారు.
అలా ఆ రాకుమార్తె తిరిగి భక్తి శ్రద్ధలతో వ్రతమాచరించి... అందమైన, శౌర్యపరాక్రమములు కలిగిన నవయవ్వన రాకుమారుడిని భర్తగా పొందింది.

అట్లతద్ది అంతరార్థం...

త్రిలోక సంచారి అయిన నారదుని ప్రోద్బలంతో గౌరీదేవి శివుడిని పతిగా పొందాలని చేసిన విశిష్టమైన వ్రతమే ఈ అట్లతద్దె. స్త్రీలు సౌభాగ్యం కోసం చేసుకొనే ఈ వ్రతంలో చంద్రారాధన ప్రధానమైన పూజ. చంద్రకళల్లో కొలువైవున్న ఆ పరాశక్తి అనుగ్రహంతో స్త్రీ సౌభాగ్యం పెరుగుతుందని విశ్వాసం. ఈ వ్రతాన్ని ఆచరించే మహిళల కుటుంబంలో సుఖశాంతులు వర్ధిల్లుతాయని శాస్త్రవచనం. ఈ పండుగలో అమ్మవారికి అట్లు నైవేద్యంగా పెట్టడంలో ఓ అర్థముంది. నవగ్రహాల్లోని కుజుడికీ అట్లంటే మహాప్రీతి, అట్లను ఆయనకు నైవేద్యంగా పెడితే కుజదోష పరిహారమై ఎటువంటి అడ్డంకులు రావని నమ్మకం.

వాయనం ఇచ్చేటప్పుడు ఇలా సంభాషిస్తారు.

”ఇస్తినమ్మ వాయనం”
”పుచ్చుకుంటినమ్మ వాయనం”
”అందించానమ్మా వాయనం”
”అందుకున్నానమ్మా వాయనం”
”ముమ్మాటికీ ఇస్తినమ్మ వాయనం”
”ముమ్మాటికీ అందుకుంటినమ్మ వాయనం”

ఇదీ చదవండి:శరన్నవరాత్రులు:కీలక ఘట్టం.. అమ్మవారి జన్మనక్షత్రం

Last Updated : Oct 16, 2019, 11:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.