ETV Bharat / city

గ్రేటర్ ఎన్నికల్లో 52 స్థానాల్లో పోటీ చేస్తున్నాం: ఒవైసీ - జీహెచ్​ఎంసీ ఎన్నికలు 2020

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో తెరాసతో ఎలాంటి పొత్తు లేదని మజ్లిస్‌ నేత అసదుద్దీన్‌ ఒవైసీ తెలిపారు. ఎంఐఎం కార్యకర్తలు, నేతలు ప్రజల కోసం పనిచేశారని, వారు మళ్లీ కచ్చితంగా గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. 52 స్థానాల్లో పోటీ చేస్తున్నామని తెలిపారు.

గ్రేటర్ ఎన్నికల్లో 52 స్థానాల్లో పోటీ చేస్తున్నాం: ఒవైసీ

author img

By

Published : Nov 22, 2020, 2:38 PM IST

గ్రేటర్ ఎన్నికల ప్రచారం ఊపందుకున్న వేళ నేతల విమర్శలు తారా స్థాయికి చేరాయి. ఓటర్లును ఆకట్టుకునేందుకు మజ్లిస్​ కూడా తన ప్రచారం ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఎర్రగడ్డలో పాదయాత్ర నిర్వహించారు. ఈ సారి ఎన్నికల్లో తెరాసతో తమకు ఎలాంటి పొత్తు లేదని అసదుద్దీన్ తేల్చి చెప్పారు. 52 స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నామని స్పష్టం చేశారు.

గ్రేటర్ ఎన్నికల్లో 52 స్థానాల్లో పోటీ చేస్తున్నాం: ఒవైసీ

తెరాసతో ఎంఐఎంకు ఎలాంటి పొత్తు లేదు. వరదలొచ్చినా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సహాయం చేయలేదు. భాజపా చేసిన అభివృద్ధి ఏమీలేదు కాబట్టే మతం రంగు పులుముతున్నారు. కరోనా కారణంగా కోట్లాది మంది నిరుద్యోగులుగా మారారు. నిరుద్యోగం నుంచి దృష్టి మళ్లించి విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో 52 స్థానాల్లో పోటీ చేస్తున్నాం. అసదుద్దీన్​ ఒవైసీ, ఎంఐఎం అధినేత.

ఇవీ చూడండి: ‘గ్రేటర్‌’ ఎన్నికల వేళ... హైదరాబాద్​పై ఎన్నారైల అభిప్రాయాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.