అతిత్వరలో ఆన్లైన్లో పిలిస్తే ఇంటికే పురోహితులు రానున్నారు. దీనికోసం త్వరలోనే 'పూజ్యో' యాప్ ప్రారంభించనున్నట్లు యాప్ ఫౌండర్ శ్రీదేవి యడవల్లి తెలిపారు. హైదరాబాద్ పరిధిలోని ప్రజలందరూ తమ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
" సుదీర్ఘ ఆలోచనల అనంతరం పిలిస్తే ఇంటికే పూజారులు వచ్చేలా ఏర్పాట్లు చేశాం. ఈ మేరకు 'పూజ్యో' యాప్ను రూపొందించాం. సమాజ సేవలో భాగంగానే మేము హిందూ ప్రజలందరికీ ఈ సదవకాశాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నాం. ఆన్లైన్ ద్వారా పూజారి సేవలు పొందేందుకు నిర్ణీత రుసుములు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా సేవలు అందిస్తున్నాం. త్వరలోనే 'పూజ్యో' యాప్ను ప్రారంభించనున్నాం."
-శ్రీదేవి, పూజ్యో యాప్ ఫౌండర్
ఇదీ చూడండి: RTC Bus Charges: బస్సు ఛార్జీల పెంపునకు ఆర్టీసీ సిద్ధం.. ఎంత పెంచుతున్నారంటే..?