కరోనా బారి నుంచి ప్రపంచం కుదుటపడుతున్న సమయంలో ఉద్యోగ నియామకాల్లో సానుకూల ధోరణి కనిపిస్తోంది. నౌకరీడాట్‌కామ్ సంస్థ విడుదల చేసిన నౌకరీజాబ్‌స్పీక్- ఫిబ్రవరి 2022 నివేదిక ప్రకారం హైదరాబాద్‌లో ఉద్యోగ నియామకాలు భారీగా జరుగుతున్నట్లు తేలింది. గతంతో పోల్చితే 43 శాతం పెరిగినట్లు అధ్యయనం సూచిస్తోంది. గతేడాది జనవరిలో 3,908, ఫిబ్రవరిలో 3020 నియామక సూచీ ఉండగా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో 4,329కి చేరుకుంది. దేశవ్యాప్తంగా ఉద్యోగ నియామకాలపై ఆ సంస్థ ప్రతి నెలా అధ్యయనం చేస్తోంది. ఫిబ్రవరి నివేదిక ప్రకారం దేశంలో హైదరాబాద్ సహా అన్ని మెట్రో నగరాల్లో ఉద్యోగ నియామకాల్లో భారీగా పెరుగుదల కనిపించింది. సూచీ ప్రకారం దేశవ్యాప్తంగా గతేడాది సెప్టెంబరులో 2,753 అత్యధిక నియామకాలు జరగ్గా.. ప్రస్తుత సంవత్సరం జనవరిలో 2716, ఫిబ్రవరిలో 3,074గా నమోదైంది.
ఇదీ చూడండి: