ETV Bharat / city

ArunSagar Awards 2022: 'మనకెప్పుడు అవార్డు వస్తుందనేవాడు.. ఇప్పుడు తానే అవార్డుగా మారాడు' - అరుణ్​సాగర్ ట్రస్ట్ విశిష్ట పురస్కారాలు

ArunSagar Awards 2022: పాత్రికేయ, సాహిత్య రంగంలో విశేష కృషి చేసిన ప్రముఖులకు ఏటా అందజేసే అరుణ్​సాగర్ ట్రస్ట్ విశిష్ట పురస్కారాల వేడుక హైదరాబాద్​లో అట్టహాసంగా జరిగింది. 2022 సంవత్సరానికి గానూ సాహిత్య రంగంలో ప్రముఖ కవి, విమర్శకులు ప్రసాదమూర్తికి విశిష్ట సాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేయగా... పాత్రికేయ రంగంలో ఈనాడు ఏపీ సంపాదకులు మానుకొండ నాగేశ్వర్ రావు విశిష్ట పాత్రికేయ పురస్కారాన్ని అందుకున్నారు.

ArunSagar Awards 2022  distributed to eenadu ap editor nageshwar rao and writer prasadarao

author img

By

Published : Jan 2, 2022, 5:00 PM IST

'మనకెప్పుడు అవార్డు వస్తుందనేవాడు.. ఇప్పుడు అవార్డుగా మారాడు'

ArunSagar Awards 2022: వర్ధమాన పాత్రికేయులకు అరుణ్​సాగర్‌ ఒక స్ఫూర్తి అని ఈనాడు ఆంధ్రప్రదేశ్​ సంపాదకులు ఎం.నాగేశ్వరరావు తెలిపారు. సాహితీ, పాత్రికేయ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఏటా ఇచ్చే అరుణ్​సాగర్‌ విశిష్ట పురస్కారాల వేడుక హైదరాబాద్​ ప్రెస్​క్లబ్​లో ఘనంగా జరిగింది. మీడియా అకాడమీ ఛైర్మన్‌ అల్లం నారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ, ప్రజా వాగ్గేయకారుడు గోరటి వెంకన్న, తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్ జూలూరి గౌరీశంకర్‌ తదితరులు హాజరయ్యారు.

అరుణ్‌ సాగర్‌ విశిష్ట సాహితీ పురస్కారాన్ని ప్రముఖ కవి ప్రసాదమూర్తికి, విశిష్ట పాత్రికేయ పురస్కారాన్ని ఎం.నాగేశ్వరరావుకు ప్రదానం చేశారు. విశిష్ట సాహిత్య పురస్కారాన్ని అందుకున్న గ్రహీతలు ప్రసాదమూర్తి, నాగేశ్వరరావు.. అరుణ్​సాగర్​తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. ట్రస్ట్ ప్రదానం చేసిన పురస్కార నగదును నాగేశ్వరరావు.. అరుణ్​సాగర్​ కుమార్తె శ్రిత విద్యాభ్యాసం కోసం అందజేశారు.

అరుణ్​సాగర్ ఒక మెరుపు..

"అరుణ్‌ సాగర్ నాకు మంచి మిత్రుడు. లాంగ్ జర్నీ ఇష్టపడే ఆయన లైఫ్ షార్ట్ అవటం దురదృష్టకరం. అరుణ్​సాగర్ ఒక మెరుపు. నికార్సయిన ఆయన వ్యక్తిత్వం రచనల్లో కనిపించేది. అరుణ్​సాగర్ స్నేహశీలి, వర్ధమాన పాత్రికేయులకు ఆయనో స్ఫూర్తి. ఆయన పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేసిన స్నేహితులను అభినందనలు. సమాజానికి మంచి పాత్రికేయులను అందించేందుకు కృషి చేయాలని కోరుకుంటున్నా. అరుణ్​సాగర్ పురస్కార నగదును ఆయన కుమార్తె చదువుకు ఇస్తున్నా" - ఎం. నాగేశ్వరరావు, ఈనాడు ఆంధ్రప్రదేశ్​ సంపాదకులు

అతడే అవార్డుగా మారాడు..

"నా కుటుంబంతో గడిపిన సమయం కంటే అరుణ్ సాగర్‌తోనే ఎక్కువగా ఉండేవాడిని. మనకెప్పుడు అవార్డులు వస్తాయని అరుణ్‌ నాతో అనేవాడు. అతడే అవార్డుగా మారతాడని ఎప్పుడూ అనుకోలేదు. ఆ తమ్ముడి పేరుతో అవార్డు అందుకోవడం ఆనందంగా ఉంది" - ప్రసాదమూర్తి, ప్రముఖ కవి, విమర్శకులు

ఇదీ చూడండి:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.