ETV Bharat / city

TTD News : తితిదేలో వినియోగించిన పూలతో కళాకృతులు

author img

By

Published : Sep 27, 2021, 9:16 AM IST

తిరుమల తిరుపతి దేవస్థానా(TTD News)ల్లో వినియోగించిన పూలను శాస్త్రీయ పద్ధతుల్లో ఎండబెట్టి వాటితో శ్రీవారి చిత్ర పటాలు, పవిత్ర చిహ్నాలు రూపొందించబోతున్నారు. అలాగే వచ్చే నెల 7వ తేదీ నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు.

తితిదేలో వినియోగించిన పూలతో కళాకృతులు
తితిదేలో వినియోగించిన పూలతో కళాకృతులు

తిరుమల తిరుపతి దేవస్థానా(TTD News)ల్లో వినియోగించిన పూలు అందమైన కళాకృతుల రూపంలో దర్శనమివ్వనున్నాయి. ఈ మేరకు తితిదే(TTD News)తో పశ్చిమగోదావరి జిల్లా వెంకట్రామన్నగూడెంలోని డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం ఇటీవల అవగాహన ఒప్పందం (ఎంవోయూ) చేసుకుంది. పూజ అనంతరం పూలు నిరుపయోగం కాకుండా వాటిని శాస్త్రీయ పద్ధతుల్లో ఎండబెట్టి వాటితో శ్రీవారి చిత్ర పటాలు, పవిత్ర చిహ్నాలు రూపొందించటంతో పాటు వాటిని అందమైన ఫ్రేమ్‌లలో ఉంచి భక్తులకు విక్రయించాలని దేవస్థానం నిర్ణయించింది.

ఈ నెల 28 నుంచి మహిళలకు శిక్షణ

ఇందుకు అవసరమైన సాంకేతిక సహకారం, శిక్షణను అందించేందుకు ఉద్యాన విశ్వవిద్యాలయంతో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ఐదు సంవత్సరాలు ఉంటుంది. ఇందుకుగాను వర్సిటీకి రూ. 83.50 లక్షల నిధుల్ని తితిదే అందించనుంది. ఈ ఉత్పత్తుల తయారీ శిక్షణ కోసం తిరుమల పరిసర గ్రామాలకు చెందిన 30 మంది మహిళలను ఎంపిక చేశారు. ఈ నెల 28 నుంచి చీనీ పరిశోధన కేంద్రంలో వారికి శిక్షణ ఇవ్వనున్నారు. చీనీ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త నాగరాజు, వెంకట్రామన్నగూడెంలోని కేవీకే సమన్వయకర్త డాక్టర్‌ ఇ.కరుణశ్రీ పర్యవేక్షించనున్నారు. తొలి బ్యాచ్‌ శిక్షణ పూర్తవగానే మరో బ్యాచ్‌ మహిళలకు కూడా శిక్షణ ఇవ్వనున్నారు.

7 నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు(TTD News) అక్టోబరు 7 నుంచి 15వ తేదీ వరకు జరగనున్నాయి. కొవిడ్‌ వైరస్‌ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించాలని తితిదే నిర్ణయించింది. శ్రీవారి ఆలయంలో అక్టోబరు 5వ తేదీన కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరగనుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.