బ్లాక్ ఫంగస్ వ్యాధితో భయాందోళనలు నెలకొన్నవేళ... వారి అవసరం, కష్టాన్నే కాసులుగా మార్చుకుంటున్నారు కొందరు వ్యక్తులు. బ్లాక్ ఫంగస్ నియంత్రణలో కీలకంగా మారిన ఆంపోటెరాసిన్ బి ఇంజెక్షన్లను నల్లబజారులో విక్రయిస్తూ ఎనిమిది మందిని ఏపీలోని గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 46 అంపోటెరాసిన్ బి ఇంజెక్షన్లతో సహా రూ. 3 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు రేంజ్ డీఐజీ త్రివిక్రమ్ వర్మ, అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తెలిపారు.
ఈ ఇంజెక్షన్లను హోల్ సేల్ మార్కెట్లో విక్రయించేవారు... మెడికల్ రిప్రజెంటేటివ్లతో ఏకమై నల్లబజారులో విక్రయిస్తున్నట్లు డీఐజీ త్రివిక్రమ్ వర్మ చెప్పారు. గరిష్ఠ చిల్లరధర ప్రకారం రూ. 1700 లభించే అంపోటెరాసిన్ ఇంజెక్షన్లను.. నల్లబజారులో రూ.25వేలకు అమ్ముతున్నారని డీఐజీ వివరించారు.
ఇదీ చదవండి: Cm Kcr: నా కళ్లల్లో ఆనంద భాష్పాలు వస్తున్నాయ్..