ETV Bharat / city

అసెంబ్లీ సమావేశాలకు ఏర్పాట్లు.. 2 సీట్లకు ఒక్కరే..

అసెంబ్లీ సమావేశాల నిర్వహణ కోసం చేయాల్సిన ఏర్పాట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తపై అధికారులు దృష్టి సారించారు. సెప్టెంబర్​ 7 నుంచి ప్రారంభం కానున్న సమావేశాలకు కొవిడ్​ మార్గదర్శకాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆదేశించారు. ఈ నేపథ్యంలో సభ్యుల మధ్య భౌతిక దూరం పాటించేందుకు వీలుగా ప్రస్తుతం ఉన్న రెండేసి సీట్లలో ఒక్కొక్కరే కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

Telangana assembly
Telangana assembly
author img

By

Published : Aug 19, 2020, 6:12 AM IST

సెప్టెంబరు ఏడో తేదీ నుంచి జరిగే శాసనసభ, మండలి సమావేశాలకు కరోనా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేయనుంది. సభ్యుల మధ్య భౌతిక దూరం పాటించేందుకు వీలుగా ప్రస్తుతం ఉన్న రెండేసి సీట్లలో ఒక్కొక్కరే కూర్చునేలా నిబంధన విధించనుంది. ప్రస్తుతం శాసనసభలో ఒక సీటులో ఇద్దరేసి సభ్యుల చొప్పున 151 మంది సభ్యులు కూర్చునేలా సోఫాల్లాంటి 76 సీట్లు ఉన్నాయి. ఒక దానిలో సీఎం కేసీఆర్‌ కూర్చుంటున్నారు. సభలో ఆంగ్లో ఇండియన్‌ సభ్యుడితో కలిసి ఉండాల్సింది 120 మంది కాగా దుబ్బాక శాసనసభ్యుడు రామలింగారెడ్డి మృతి వల్ల ఆ సంఖ్య 119గా ఉంది. స్పీకర్‌ పోడియంపై కూర్చుంటారు. మిగిలిన 118 మంది సభ్యులకు సీట్లను సర్దుబాటు చేయాలి. దీని ప్రకారం ప్రస్తుతం ఉన్న 76 సీట్లకు ఇంకా 42 స్థానాలు ఏర్పాటు చేయాలి.

అదనంగా 42 సీట్లు

ప్రస్తుతం ఉన్న స్థానాలు శాశ్వత ప్రాతిపదికన అమర్చినవైనందున వాటిలో మార్పులకు వీలు కాదు. దీంతో 42 మంది సభ్యుల కోసం తాత్కాలికంగా సీట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం సభలో ఉన్న వాటి మాదిరిగానే తాత్కాలిక సీట్లు ఉండాలని, అన్నింటికి డెస్క్‌, మైక్‌ సౌకర్యం ఉండాలని సీఎం నిర్దేశించినందున దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తారు. శాసనమండలిలో 80 మంది సభ్యులు కూర్చునేలా సీట్లు ఉన్నాయి. ప్రస్తుతం 36 మంది సభ్యులు ఉండగా, నాలుగు ఖాళీ అయ్యాయి. ఈ 36 మందికి సీట్లు సరిపోతాయి.

సందర్శకులను అనుమతించరు

శాసనసభ జరిగే సమయంలో సందర్శకులను అనుమతించరు. తక్కువ సంఖ్యలో అధికారులు, సిబ్బందికి పాస్‌లు జారీ చేస్తారు. మీడియాను అనుమతించిన పక్షంలో భౌతిక దూరం పాటించేందుకు వీలుగా ప్రస్తుత గ్యాలరీని విస్తరించాలి. సందర్శకుల గ్యాలరీలోకి అనుమతించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. శాసనమండలిలో మీడియా గ్యాలరీ తక్కువ స్థలంలో ఉన్నందున దానిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

శాసనసభను సందర్శించిన మంత్రి ప్రశాంత్‌రెడ్డి

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు శాసనసభలో కరోనా నిబంధనలకు అనుగుణంగా సభ్యుల సీటింగ్‌ ఏర్పాటు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మంగళవారం శాసనసభ సమావేశ మందిరాన్ని, సందర్శకులు, మీడియా గ్యాలరీని సందర్శించారు. శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు, అధికారులతో సమావేశమై చర్చించారు. మండలి విప్‌ కర్నె ప్రభాకర్‌ కూడా ఇందులో పాల్గొన్నారు. ఒకటి రెండు రోజుల్లో శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డిలను ప్రశాంత్‌రెడ్డి కలవనున్నారు. అనంతరం ఏర్పాట్ల వివరాలను సభానాయకుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.