రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా చీరాలలో ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. స్థానిక బస్టాండ్ ఎదుట ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. 9 రోజులుగా కార్మికులు ఆందోళనలు చేస్తున్నా... సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని ఎంప్లాయిస్ యూనియన్ నేతలు ప్రశ్నించారు. తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు మద్ధతుగా ఎంప్లాయిస్ యూనియన్ అధ్వర్యంలో నిరసన చేపట్టినట్లు ఆ సంఘం బాధ్యులు కె.వి.రావు తెలిపారు.
ఇదీ చదవండీ... ఆర్టీసీ సమ్మె.. ఆగిన కార్మికుడి గుండె