ఐటీ విభాగంలో ఏపీఎస్ఆర్టీసీ వరుసగా రెండోసారి జాతీయ స్థాయి అవార్డు సాధించింది. 2021 ఏడాదికి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ విభాగంలో 'డిజిటల్ టెక్నాలజీ సభ' అవార్డుకు ఎంపికైంది. జాతీయ స్థాయిలో వివిధ సంస్థలతో పోటీ పడిన ఏపీఎస్ఆర్టీసీ ఈ అవార్డును కైవసం చేసుకుంది.
ఐటీ విభాగంలో గతేడాది కూడా డిజిటల్ టెక్నాలజీ సభ అవార్డు ఏపీఎస్ఆర్టీసీకే వరించింది. యాప్ ద్వారా నగదు రహిత లావాదేవీలు, కాగిత రహిత టికెట్లను ప్రవేశపెట్టిన ఆర్టీసీ.. వాటిని సమర్థంగా అమలు చేస్తున్నందుకుగాను ఈ అవార్డుకు ఎంపికైంది. బుధవారం సాయంత్రం 4 గంటలకు వర్చువల్ సెమినార్ ద్వారా ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ ఆర్పీ ఠాకూర్ అవార్డు అందుకోనున్నారు.
ఇవీచూడండి: రేపట్నుంచే 6,7, 8 తరగతులు.. తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి