AP EAPCET 2022: ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. మంగళవారం ఉదయం విజయవాడలో ఆ రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేశారు. ఇంజినీరింగ్, వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాలకు మొత్తం 3,01,172 మంది దరఖాస్తు చేసుకోగా.. 2,82,496 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇందులో ఇంజినీరింగ్ పరీక్ష 1,94,752, వ్యవసాయ కోర్సు పరీక్ష 87,744 మంది రాశారు. ఇంజినీరింగ్‌లో 89.12 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా.. వ్యవసాయ విభాగంలో 95.06 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత పొందారు.
ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
'ఈసారి ఇంజినీరింగ్, అగ్రి, ఫార్మా ప్రవేశాలకు ఇంటర్ మార్కుల వెయిటేజ్ లేదు. ర్యాంకుల ఆధారంగానే ప్రవేశాలు జరుగుతాయి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మార్కులు, ర్యాంకులతో సంబంధం లేకుండా ప్రవేశాలు. ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో మేనేజ్‌మెంట్ కోటా 35శాతం సీట్లు ఈసారి ప్రభుత్వమే భర్తీ చేస్తుంది.'
- బొత్స సత్యనారాయణ, ఏపీ విద్యాశాఖ మంత్రి