ETV Bharat / city

ఏపీలో "కేసీఆర్ జిందాబాద్".. గులాబీ బాస్​కు పాలాభిషేకం..! - CM KCR About Job Notifications

AP Employees Praises Telangana CM KCR :ఏపీలోని విశాఖలో ఏపీ నిరుద్యోగ ఐకాస ఆధ్వర్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. తమ రాష్ట్రంలోనూ ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు.

AP Employees Praises Telangana CM KCR
AP Employees Praises Telangana CM KCR
author img

By

Published : Mar 9, 2022, 7:14 PM IST

AP Employees Praises Telangana CM KCR : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలకు నోటిఫికేషన్​ విడుదల చేయడాన్ని హర్షిస్తూ.. ఏపీలోని విశాఖలో సీఎం కేసీఆర్​ చిత్రపటానికి ఏపీ నిరుద్యోగ ఐకాస పాలాభిషేకం చేసింది. 91 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నందుకుగానూ కేసీఆర్‌కు ఐకాస అభినందనలు తెలిపింది. ఏపీలోనూ సీఎం జగన్‌ ఇచ్చిన హామీ మేరకు 2లక్షల 32వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్‌ చేసింది. గ్రూప్స్‌ ఉద్యోగాల కోసం తక్షణమే నోటిఫికేషన్ జారీ చేయాలని.. వయోపరిమితిని పెంచాలని కోరారు.

తెలంగాణలో ఉద్యోగాల జాతర..

Job Notifications in Telangana : తెలంగాణలో ఉద్యోగాల జాతర మొదలైంది. నిరుద్యోగులకు సీఎం కేసీఆర్‌ తీపికబురు అందించారు. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 91,142 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని.. వాటిలో 80,039 ఉద్యోగాలకు నేడే నోటిఫికేషన్‌ జారీ చేస్తున్నట్లు వెల్లడించారు.

CM KCR About Job Notifications : మిగిలిన 11,103 ఒప్పంద ఉద్యోగులకు క్రమబద్దీకరిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా 95 శాతం స్థానికత కోటాతో రాష్ట్రపతి ఉత్తర్వులు సాధించామని సీఎం పేర్కొన్నారు. అటెండర్‌ నుంచి ఆర్డీవో వరకు 95 శాతం స్థానికులకే ఉద్యోగాలు వస్తాయన్నారు. ఐదు శాతం మాత్రమే స్థానికేతరులకు వస్తాయని వివరించారు. నియామకాల్లో 95 శాతం స్థానిక కోటా సాధించిన ఏకైక రాష్ట్రం తెలంగాణే అని సీఎం తెలిపారు.

ఏపీలో "కేసీఆర్ జిందాబాద్"

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.