ETV Bharat / city

'ఒక క్యారెక్టర్ బాగోలేకపోతే నాటకాన్ని ఎలా నిషేధిస్తారు' - chintamani drama

AP high court on Chinthamani drama: చింతామణి నాటకం నిషేధంపై దాఖలైన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. ఒక పాత్ర బాగోకపోతే మొత్తం నాటకాన్ని ఎలా నిషేధిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఈ వ్యాజ్యం దాఖలు చేశారు.

'ఒక క్యారెక్టర్ బాగోలేకపోతే నాటకాన్ని ఎలా నిషేధిస్తారు'

author img

By

Published : Feb 2, 2022, 10:52 PM IST

AP high court on Chinthamani drama: చింతామణి నాటక నిషేధంపై వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్​పై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. నాటకంలో ఒక పాత్ర బాగోకపోతే మొత్తం నాటకాన్ని ఎలా నిషేధిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. చింతామణి పుస్తకాన్ని నిషేధించనప్పుడు.. నాటకాన్ని ఎలా బ్యాన్ చేస్తారని ఆక్షేపించింది. ప్రభుత్వానికి వచ్చిన వినతుల ఆధారంగా నాటకాన్ని నిషేధించామని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. వచ్చే మంగళవారంలోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన కోర్టు.. విచారణను ఆ రోజుకే వాయిదా వేసింది.

చింతామణి నాటక ప్రదర్శనపై నిషేధం విధిస్తూ ఈనెల 17న రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఈ వ్యాజ్యం దాఖలు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర యువజన సర్వీసులు, పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడిని ప్రతివాదులుగా చేర్చారు. దేవదాసి వ్యవస్థపై అవగాహన, వ్యభిచార వృత్తికి వ్యతిరేకంగా సామాజిక సంస్కర్త కళ్లకూరి నారాయణరావు ఈ నాటకాన్ని రచించారని పిటిషన్‌లో వివరించారు. 1920 నుంచి ఎలాంటి అవరోధం లేకుండా నాటకాన్ని ప్రదర్శిస్తున్నారని గుర్తుచేశారు. ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాయడమేనన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఈ నాటకాన్ని ప్రదర్శిస్తూ వేలమంది కళాకారులు జీవనోపాధి పొందుతున్నారని పూర్తిగా నిషేధిస్తే వారు రోడ్డునపడతారని పేర్కొన్నారు. ఈ నాటకం ప్రదర్శించిన కళాకారులకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు గతంలో పలు అవార్డులు, బహుమానాలు ఇచ్చాయని గుర్తుచేశారు. కళాకారుడు స్థానం నరసింహారావును 1956లో కేంద్ర ప్రభుత్వం.. పద్మశ్రీ పురస్కారంతో సత్కరించిందన్నారు. చింతామణి నాటకాన్ని నిషేధిస్తూ రాష్ట్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.. న్యాయవిచారణ ముందు నిలువదన్నారు. ప్రభుత్వం జారీచేసిన జీవో 7ను రద్దు చేయాలని అభ్యర్థించారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.