ETV Bharat / city

ఏపీలో ఇంటర్‌ ఆన్‌లైన్ అడ్మిషన్ల ప్రక్రియపై హైకోర్టు స్టే

author img

By

Published : Nov 2, 2020, 5:56 PM IST

ఆంధ్రప్రదేశ్​లో ఆన్​లైన్​ ద్వారా ఇంటర్​ ప్రవేశాల ప్రక్రియను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై విచారించిన ఆ రాష్ట్ర హైకోర్టు... స్టే విధించింది. తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేస్తూ... అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఇంటర్‌ ఆన్‌లైన్ అడ్మిషన్ల ప్రక్రియపై హైకోర్టు స్టే

ఇంటర్‌ ఆన్‌లైన్ అడ్మిషన్ల ప్రక్రియపై ఈ నెల 10 వరకు ఆంధ్రప్రదేశ్​ హైకోర్టు స్టే విధించింది. ఆన్‌లైన్‌ ద్వారా ఇంటర్ ప్రవేశాల ప్రక్రియను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై సోమవారం విచారణ జరిపిన ధర్మాసనం... ఈ మేరకు ఆదేశించింది. ఆన్​లైన్​ ద్వారా ప్రవేశాలు జరిపితే విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం పడుతుందని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. అడ్మిషన్ల ప్రక్రియలో నిబంధనలు పాటించట్లేదని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.

ఏ నిబంధనల ప్రకారం అడ్మిషన్లు ఆన్​లైన్​లో చేపడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేసేందుకు ప్రభుత్వ తరఫు న్యాయవాది సమయం కోరారు. ఈ క్రమంలో తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేస్తూ... ప్రభుత్వాన్ని అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.

ఇదీ చూడండి:'దుబ్బాకలో పెద్దఎత్తున డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.