ఏపీ మాజీమంత్రి అచ్చెన్నాయుడికి ఆ రాష్ట్ర హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.2 లక్షలు పూచీకత్తు చెల్లించాలని... దేశం విడిచి వెళ్లరాదని పేర్కొంది. ఈఎస్‌ఐలో స్కామ్ జరిగిందని తెదేపా ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని ఇటీవల ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. అప్పటికే అనారోగ్యంతో ఉన్నందున అచ్చెన్న అరెస్టుపై వివాదం నెలకొంది.
అరెస్టు అనంతరం గుంటూరు ఆస్పత్రిలో అచ్చెన్నకు వైద్యులు శస్త్రచికిత్స చేశారు. శస్త్రచికిత్స అయిన కొద్దిరోజులకే కరోనా సోకింది. కోర్టు ఆదేశాలతో ప్రైవేటు ఆస్పత్రిలో ఏపీ ప్రభుత్వం చికిత్స అందించింది. అచ్చెన్నాయుడు 70 రోజులకు పైగా రిమాండ్‌లో ఉన్నారు.