ETV Bharat / city

ఏపీ: బార్ల నుంచి 30 రోజుల్లో కొవిడ్‌ రుసుం వసూలు - ఏపీలో మద్యం విక్రయాలు

ఆంధ్రప్రదేశ్‌లోని బార్ల లైసెన్సుదారుల నుంచి 30 రోజుల్లోగా కొవిడ్‌ రుసుము వసూలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. నిర్దేశిత వ్యవధిలోగా ఆ రుసుము చెల్లించకపోతే చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ బాధ్యతలను ఆయా జిల్లాల ఎక్సైజ్‌ సూపరింటెండెంట్లకు అప్పగించింది.

ఏపీ: బార్ల నుంచి 30 రోజుల్లో కొవిడ్‌ రుసుం వసూలు

author img

By

Published : Sep 21, 2020, 12:05 PM IST

ఏపీ ప్రభుత్వానికి కొవిడ్‌ రుసుము రూపంలో రూ.50 కోట్లు ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే లైసెన్సు రుసుములు, రిజిస్ట్రేషన్‌ ఛార్జీల వసూళ్లను కూడా కలిపితే మొత్తంగా రూ.180 కోట్ల వరకూ ఆదాయం వస్తుందని భావిస్తున్నారు.

ఏపీ వ్యాప్తంగా ఉన్న 840 బార్ లైసెన్సులను 2021 జూన్‌ ఆఖరి వరకూ కొనసాగిస్తూ జగన్​ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బార్లు తెరిచేప్పుడు అనుసరించాల్సిన నియమ నిబంధనలను పేర్కొంటూ ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ వివేక్‌ యాదవ్‌ ఆదివారం మార్గదర్శకాలు విడుదల చేశారు. ఈ మేరకు కట్టడి ప్రాంతాలో ఉన్న బార్లను ఆయా జిల్లాల కలెక్టర్ల వద్ద ముందస్తు అనుమతి తీసుకున్న తర్వాతే తెరవాల్సి ఉంటుంది.

ప్రభుత్వ సూచనలు..

  • కాలం చెల్లిన బీర్లను విక్రయించటానికి వీల్లేదు.
  • భౌతిక దూరం పాటించేందుకు వీలుగా బార్లలో టేబుళ్లు ఏర్పాటు చేయాలి.
  • పనివేళల్లో రోజుకు రెండు సార్లు మొత్తం ప్రాంగణాన్ని శానిటైజ్‌ చేయాలి.
  • ప్రవేశ ద్వారం వద్ద శానిటైజర్లు, థర్మల్‌ స్కానర్లు అందుబాటులో ఉంచాలి.
  • ప్రతి ఒక్కర్నీ థర్మల్‌ స్క్రీనింగ్‌ చేసిన తర్వాతే లోపలికి పంపించాలి.
  • పనిచేసే సిబ్బంది తప్పనసరిగా మాస్కులు, చేతి తొడుగులు ధరించాలి.
  • జూన్‌ ఒకటో తేదీ కంటే ముందు చెల్లించిన చలానాలను లైసెన్సు రుసుము, రిజిస్ట్రేషన్‌ ఛార్జీల కింద అంగీకరించరు.

లైసెన్సు రుసుముల వివరాలు ఇలా

కొవిడ్‌ లాక్‌డౌన్‌ నేపథ్యంలో 101 రోజుల పాటు బార్లు మూతపడిన సంగతి తెలిసిందే. ఆ కాలానికి మినహాయించుకొని 2020 సెప్టెంబర్‌ 19 నుంచి 2021 జూన్‌ 30వ తేదీ వరకూ ఒక్కో లైసెన్సు దారు నుంచి ఎంతెంత లైసెన్సు రుసుము, రిజిస్ట్రేషన్‌ ఛార్జీ వసూలు చేయాలనేది ప్రభుత్వం నిర్దేశించింది.

ఇదీ చదవండి: మండలానికో దస్తావేజు లేఖరికి ప్రభుత్వం సన్నాహాలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.