ETV Bharat / city

మద్యం ప్రియులకు ఉపశమనం​... ధరలను సవరించిన ఏపీ ప్రభుత్వం - ap high court on Liquor

ఏపీలో మద్యం ధరల్ని ప్రభుత్వం సవరించింది. చీప్‌‌ లిక్కర్‌పై గతంలో పెంచిన ధరల్ని తగ్గించటంతోపాటు... ఖరీదైన బ్రాండ్ల ధరల్ని పెంచింది. వివిధ రకాల మద్యం బ్రాండ్ల ధరలను... బాటిల్‌ సైజుల వారీగా సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బీర్లుపై 30 రూపాయలు తగ్గించింది. ధరల సవరణతో చీప్‌ లిక్కర్‌ ధర తెలంగాణ కంటే ఏపీలోనే తక్కువ అయిందని, పొరుగు రాష్ట్రం నుంచి మద్యం అక్రమ రవాణా తగ్గుతుందని భావిస్తున్నామని ఏపీ అబ్కారీ శాఖ తెలిపింది.

ap-government-orders
మద్యం ప్రియులకు ఉపశమనం​...ధరలను సవరించిన ప్రభుత్వం
author img

By

Published : Sep 4, 2020, 7:56 AM IST

మద్యం ప్రియులకు ఉపశమనం​...ధరలను సవరించిన ప్రభుత్వం

దేశీయంగా తయారైన విదేశీ మద్యం, విదేశాల్లో తయారైన మద్యం బ్రాండ్లు ధరల్ని సవరిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 180 మిల్లీ లీటర్ల బాటిల్‌ ధర 120 రూపాయలకు మించని బ్రాండ్లకు... సైజుల వారీగా 30 నుంచి 120 రూపాయలు వరకూ తగ్గించినట్లు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. క్వార్టర్‌ బాటిల్‌ ధర 120 నుంచి 150 రూపాయల మధ్యలో ఉన్న బ్రాండ్లకు... 60 ఎంఎల్​ నుంచి 750 ఎంఎల్ వరకూ రూ.30 నుంచి రూ.280 చొప్పున తగ్గించినట్లు ఏపీ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు. క్వార్టర్‌ బాటిల్‌ ధర 150 నుంచి 190 రూపాయల మధ్యలో ఉన్న బ్రాండ్లకు ధరల్లో ఎటువంటి మార్పూ లేదని స్పష్టం చేశారు.

సైజులవారీగా ధరల పెంపు..

క్వార్టర్‌ 190 రూపాయల నుంచి 210కి మించి ధర ఉన్న బ్రాండ్లకు సైజులవారీగా 40 నుంచి 300 రూపాయల వరకూ పెంచారు. 210 నుంచి 290 రూపాయల ధర ఉన్న బ్రాండ్లకు సైజులవారీగా 40 నుంచి 340 వరకూ పెంచినట్లు జీవోలో పేర్కొన్నారు. క్వార్టర్‌ ధర 290 నుంచి 360 మధ్యలో ఉన్న బ్రాండ్లకు పరిమాణం వారీగా 60 నుంచి 470 రూపాయల వరకూ పెంచారు. క్వార్టర్‌ బాటిల్‌ ధర 600 రూపాయలు అంతకంటే ఎక్కువ ఉంటే... 140 నుంచి 1320 రూపాయల వరకూ ధర పెంచుతూ ఆదేశాలు వెలువడ్డాయి. అన్ని బ్రాండ్ల బీర్ బాటిళ్లపై 30 రూపాయలు తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. రెడీ టూ డ్రింక్ లూజ్ మద్యంపై 30 రూపాయల మేర తగ్గింపు వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది.

సవరించిన ధరలు గురువారం నుంచే అమల్లోకి వచ్చాయి. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణా అరికట్టేందుకు, శానిటైజర్లు, మిథైల్‌ ఆల్కహాల్‌ తాగటంతో ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు నివారించేందుకు... మద్యం ధరలు సవరించాలంటూ ఎస్​ఈబీ సిఫార్సు చేసింది. దీన్ని పరిగణలోకి తీసుకుని ధరలు సవరించామని ఏపీ ప్రభుత్వం వెల్లడించింది.

ఇవీచూడండి: 'ఆంధ్రప్రదేశ్​లో దశల వారీగా మద్యపానాన్ని నియంత్రిస్తున్నాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.