2020-21 ఏడాదికి ఏపీ రాష్ట్రప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధరలు ప్రకటించించింది. మద్దతు ధరకు అమ్ముకోవాలంటే రైతన్నలు తప్పనిసరిగా ఈ-కర్షక్లో పంట వివరాలు నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకున్న తర్వాత ఆర్బీకేలో గ్రామ వ్యవసాయ సహాయకులు, గ్రామ ఉద్యాన సహాయకుల పంటలు అమ్ముకునేందుకు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అప్పుడు కనీస గిట్టుబాటు ధర లభించకుంటే వెంటనే వారు కొనుగోలు చేస్తారు. రైతులు ఆర్బీకేకు తీసుకువచ్చే ధాన్యం కనీస నాణ్యతా ప్రమాణాలు ఉండేలా చూసుకోవాలి.
పంట | మద్దతు ధర (క్వింటాకు) |
పసుపు | 6,850 |
మిర్చి | 7,000 |
ధాన్యం(ఏ-గ్రేడ్) | 1,888 |
ఉల్లి | 770 |
జొన్నలు(మాల్దండి) | 2,640 |
సజ్జలు | 2,150 |
రాగులు | 3,295 |
మొక్కజొన్నలు | 1,850 |
కొబ్బరిబాల్ | 10,300 |