ETV Bharat / city

ముగిసిన మంత్రివర్గ సమావేశం.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం

AP CABINET MEETING: ఏపీ సీఎం జగన్​మోహన్​రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. పలు పథకాలకు సంబంధించి నిధుల విడుదలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

ముగిసిన మంత్రివర్గ సమావేశం.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం
ముగిసిన మంత్రివర్గ సమావేశం.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం
author img

By

Published : Jun 24, 2022, 3:50 PM IST

AP CABINET MEETING: ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. సుమారు రెండున్నర గంటల పాటు సాగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కోనసీమ జిల్లాను ‘అంబేడ్కర్‌ కోనసీమ’ జిల్లాగా పేరు మార్పు, కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. పీఆర్సీ జీవోలో చేసిన మార్పులకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.

ఈ నెల 27న అమ్మఒడి పథకానికి నిధుల విడుదలతో పాటు అర్జున అవార్డు గ్రహీత జ్యోతి సురేఖకు గ్రూప్‌-1 ఉద్యోగం ఇచ్చేందుకు అవసరమైన చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వచ్చే నెలలో అమలు చేయనున్న నాలుగు సంక్షేమ పథకాలు విద్యాకానుక, కాపు నేస్తం, జగనన్న తోడు, వాహనమిత్ర పథకాలకు మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. వంశధార నిర్వాసితులకు రూ.216 కోట్ల పరిహారం నిధులు విడుదల చేసేందుకు కేబినెట్‌ భేటీలో నిర్ణయం తీసుకున్నారు.

ఇవీ చూడండి..:

సికింద్రాబాద్ అల్లర్ల కేసు.. సాయి డిఫెన్స్ అకాడమీకి నోటీసులు జారీ

కొండ చిలువ గుడ్లను పొదిగించిన పాము సంరక్షకులు.. 8 పిల్లలను అడవిలో..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.