రాజధాని మేం కట్టి చూపిస్తాం: కన్నా - amaravathi news
ముఖ్యమంత్రి జగన్ అనుభవరాహిత్యం, నియంతృత్వ ధోరణి వల్ల ఏపీకి తీవ్ర నష్టం జరుగుతోందని ఆ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. అమరావతి విషయంలో జగన్మోహన్రెడ్డి చేసిన ప్రకటన వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజధాని వ్యవహారంపై త్వరలోనే పార్టీ తరఫున పోరుబాటపడుతామని వెల్లడించారు. అధికార పార్టీ నేతల వ్యాఖ్యలు, జనసేనతో చెలిమి, భాజపా రాజకీయ కార్యాచరణ అంశాలపై ఈటీవీ భారత్తో కన్నా లక్ష్మీనారాయణ ముచ్చటించారు.