ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 41,820 పరీక్షలు నిర్వహించగా.. 493 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 20,62,303 మంది వైరస్ బారినపడినట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్ వల్ల ఏడుగురు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 14,327కి చేరింది. 24 గంటల వ్యవధిలో 552 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 20,42,476కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం ఏపీలో 5,500 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,91,42,162 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.
ఏపీలో జిల్లాల వారీగా కేసులను పరిశీలిస్తే అత్యధికంగా చిత్తూరులో 113, గుంటూరులో 74, తూర్పుగోదావరిలో 45, పశ్చిమగోదావరిలో 66, అనంతపురంలో 6, కడపలో 24, కృష్ణాలో 56, నెల్లూరులో 31, ప్రకాశంలో18, శ్రీకాకుళంలో 20, విశాఖలో 25, కర్నూలులో 8, విజయనగరంలో ఏడుగురికి కరోనా సోకినట్లు వైద్య అధికారులు తెలిపారు.
-
#COVIDUpdates: 21/10/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) October 21, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,59,408 పాజిటివ్ కేసు లకు గాను
*20,39,581 మంది డిశ్చార్జ్ కాగా
*14,327 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 5,500#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/DmHCz1zIxP
">#COVIDUpdates: 21/10/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) October 21, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,59,408 పాజిటివ్ కేసు లకు గాను
*20,39,581 మంది డిశ్చార్జ్ కాగా
*14,327 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 5,500#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/DmHCz1zIxP#COVIDUpdates: 21/10/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) October 21, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,59,408 పాజిటివ్ కేసు లకు గాను
*20,39,581 మంది డిశ్చార్జ్ కాగా
*14,327 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 5,500#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/DmHCz1zIxP
ఇదీ చదవండి: కడప: ఆదిరెడ్డిపల్లె వద్ద రోడ్డు ప్రమాదం... ముగ్గురు మృతి