గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ బాల్య వివాహాలు కొనసాగుతున్నాయని.. ముక్కు పచ్చలారని బాలికలకు బాల్యంలోనే పెళ్లి చేసి.. వారి జీవితాలను నాశనం చేస్తున్నారని అంకురం సంస్థ అధ్యక్షురాలు సుమిత్రా ఆందోళన వ్యక్తం చేశారు. చిన్న వయసులోనే బాలికలను బాల్య వివాహాల్లోకి లాగుతున్నారని .. గ్రామీణ ప్రాంతాల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు.
చిన్నారులకు ఇష్టం లేకున్నా... తల్లిదండ్రులు బలవంతంగా వివాహాలు చేస్తున్నారని.. పెళ్లికి భయపడి.. పిల్లలు ఇంటి నుంచి వెళ్లిపోతున్నారని తెలిపారు. వారికి తెలియకుండానే.. అక్రమ రవాణాకు గురై.. వ్యభిచార కూపాల్లో చిక్కుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం చాలామంది పిల్లలు చదువుకొని వారి కాళ్ల మీద వారు నిలబడాలనే స్వభావంతో ఉన్నారని.. తల్లిదండ్రులు వారికి కావాల్సిన స్వేచ్ఛ ఇవ్వాలని కోరారు.
ఇవీ చూడండి: తెలంగాణలో మరో 2,072 కరోనా కేసులు, 9 మరణాలు