ETV Bharat / city

విశాఖ భూముల అమ్మకంపై ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు - తెలంగాణ వార్తలు

ఏపీ విశాఖలోని ప్రభుత్వ భూముల అమ్మకంపై ఆ రాష్ట్ర హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. బిల్డ్‌ ఏపీ పేరిట భూముల అమ్మకాలపై ఇచ్చిన స్టే ఉత్తర్వులే వర్తిస్తాయని వెల్లడించింది. భూముల అమ్మకం నోటిఫికేషన్​పై దాఖలైన పిటిషన్​పై ధర్మాసనం విచారణ చేపట్టింది.

 Andhra pradesh high court on vishaka lands, vishaka lands verdict
విశాఖ భూములపై ఏపీ హైకోర్టు, ఏపీ హైకోర్టు తాజా తీర్పు
author img

By

Published : Apr 23, 2021, 5:05 PM IST

ఆంధ్రప్రదేశ్​ విశాఖలో ప్రభుత్వ భూముల అమ్మకంపై.. టెండర్లు ఖరారు చేయవద్దంటూ ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో బిల్డ్‌ ఏపీ పేరిట భూముల అమ్మకాలపై ఇచ్చిన స్టే ఉత్తర్వులే.. విశాఖ భూముల అమ్మకానికి వర్తిస్తుందని వెల్లడించింది.

విశాఖలో 5 చోట్ల భూముల అమ్మకానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం... టెండర్లు ఖరారు చేయవద్దంటూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

ఇదీ చదవండి: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ కొరత లేదు: మంత్రి ఈటల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.