ETV Bharat / city

దేశంలో ఏపీలోనే ఆడవాళ్లపై నేరాలు ఎక్కువట.. - Highest Crime Rate Against Women in AP

Crimes Against Women in AP : మహిళలపై నేరాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండటం కలవరపెడుతోంది. లైంగిక వేధింపులు, అత్యాచారాలతోపాటు మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించే ఘటనలు పెరిగాయని ఎన్​సీఆర్​బీ తెలిపింది. ఈ తరహా ఘటనలపై 2019లో 1,892 కేసులు నమోదవగా... 2020లో 2,942 కేసులు రికార్డయ్యాయి.

Crimes Against Women in AP
Crimes Against Women in AP
author img

By

Published : Apr 25, 2022, 6:52 AM IST

దేశంలో ఏపీలోనే ఆడవాళ్లపై నేరాలు ఎక్కువట

Crimes Against Women in AP : మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించే ఘటనల్లో దేశంలో ఏపీ మొదటి స్థానంలో ఉందని... 2020 జాతీయ నేరాల గణాంకల నివేదిక తెలిపింది. 2020లో దేశవ్యాప్తంగా జరిగిన ఈ తరహా ఘటనల్లో 33.14 శాతం మన రాష్ట్రంలోనే నమోదవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. స్త్రీలపై జరిగిన మొత్తం నేరాల్లో స్వల్ప తగ్గుదల కనిపిస్తున్నా... భౌతిక దాడులు తగ్గకపోవడం కలవరపరుస్తోంది.

Highest Crime Rate Against Women in AP : ఈ తరహా ఘటనలకు సంబంధించి 2019లో 1,892 కేసులు నమోదు కాగా.... 2020లో ఆ సంఖ్య 2,942 కు పెరిగింది. ఏడాది వ్యవధిలో ఈ తరహా ఘటనలు 23.78 శాతం మేర అధికమయ్యాయి. 2019లో మహిళలపై 17,746నేరాలు, 2020లో 17,089 నేరాలు జరిగాయి. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 2020లో 3.70 శాతం మేర తగ్గాయి. ఈ తరహా నేరాలు అత్యధికంగా జరిగిన రాష్ట్రాల జాబితాలో 2019లో పదో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్... 2020లో ఎనిమిదో స్థానానికి చేరింది. 2019లో దేశవ్యాప్తంగా మహిళలపై జరిగిన నేరాల్లో 4.87 శాతం ఏపీలోనే ఉండగా.... 2020లో 4.59 శాతంగా ఉంది.

నేరాలు పెరిగాయి : 2019 కంటే 2020లో సైబర్ నేరాలు, చిన్నారులపై నేరాలు కొంతమేర పెరిగాయని నేర గణాంకాలు చెబుతున్నాయి. మహిళలపై నేరాల్లో 9వ స్థానం, చిన్నారులపై నేరాల్లో 16, ఆర్థిక నేరాల్లో 9, సైబర్ నేరాల్లో 7వ స్థానం, వృద్ధులపై నేరాల్లో 4, ఎస్సీ-ఎస్టీలపై నేరాల్లో 8, హత్యల్లో 15వ స్థానం, హింసాత్మక నేరాల్లో 17వ స్థానంలో ఏపీ ఉన్నట్లు... ఎన్​సీఆర్​బీ నివేదిక తెలిపింది.

అందులో మూడో స్థానం : పని ప్రదేశాల్లో మహిళల్ని లైంగికంగా వేధించిన ఘటనల్లో 72 కేసులతో హిమాచల్ ప్రదేశ్ దేశంలో మొదటి స్థానంలోనూ, 70 కేసులతో ఏపీ రెండో స్థానంలోనూ ఉన్నట్లు ఎన్​సీఆర్​బీ నివేదిక చెబుతోంది. స్త్రీలను రహస్యంగా చిత్రీకరించిన ఘటనలు అత్యధికంగా జరిగిన రాష్ట్రాల జాబితాలో ఏపీది రెండో స్థానమని నివేదిక తెలిపింది. అత్యధికంగా మహారాష్ట్రలో ఈ తరహా కేసులు 201 నమోదు కాగా, ఏపీలో 124 కేసులు ఉన్నాయి. మహిళలను వేధించిన ఘటనల్లో మహారాష్ట్రలో 2వేల 13, తెలంగాణలో 14వందల 38 తర్వాత... 956 కేసులతో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉందని ఎన్​సీఆర్​బీ వెల్లడించింది. అత్యాచారాలు 0.82 శాతం మేర పెరిగినట్లు పేర్కొంది.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.