హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారి విస్తరణ(Hyderabad Srisailam Road Expansion) పనులకు అటవీశాఖ(Telangana forest ministry) అభ్యంతరం చెబుతోంది. రెండు వరుసలుగా ఉన్న ఈ రోడ్డును నాలుగు లేన్లుగా విస్తరించేందుకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ(National Highway Authority of India)) ప్రయత్నిస్తోంది. మధ్యలో అటవీప్రాంతం(forest) ఉండటంతో అటవీభూముల బదలాయింపునకు దరఖాస్తు చేసింది. వన్యప్రాణులు, పర్యావరణ పరంగా అది సరికాదని దాన్ని తిరస్కరిస్తూ అమ్రాబాద్ ఎఫ్‌డీవో(Amrabad FDO) అటవీశాఖకు నివేదిక అందజేశారు. ఈ రహదారి పరిధిలో అచ్చంపేట అటవీ డివిజన్ కూడా ఉంది. అక్కడి నుంచి కూడా నివేదిక వచ్చాక అటవీశాఖ తుది నిర్ణయం తీసుకోనుంది.
120 ఎకరాల అటవీభూమి!
జాతీయ రహదారి 765(National Highway 765) దట్టమైన నల్లమల అటవీప్రాంతం(forest area) గుండా సాగుతుంది. అమ్రాబాద్ టైగర్ రిజర్వు(Amrabad tiger reserve) మధ్యలోంచి వెళుతుంది. పెద్దపులులు, చిరుతలు, జింకలు సహా రకరకాల వన్యప్రాణులు భారీ సంఖ్యలో ఇక్కడి అడవిలో ఉన్నాయి. వారాంతాల్లో 2,400 వరకు వాహనాలు ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తాయి. శ్రీశైలంతో పాటు నల్లమల అటవీప్రాంతం, నాగర్‌కర్నూల్ జిల్లా పరిధి పుణ్యక్షేత్రాలకు, పర్యాటక ప్రదేశాలకు పర్యాటకులు వస్తుంటారు. ఈ మార్గంలో అటవీభూమి ఉండటం, రక్షిత అటవీప్రాంతం కావడంతో రోడ్డు విస్తరణకు అటవీశాఖ(forest department permission) అనుమతి తప్పనిసరి. 48.8 హెక్టార్ల (120 ఎకరాలు) అటవీభూమి కావాలని, విస్తరణ పనులకు అనుమతి కావాలని ఎన్‌హెచ్‌ఏఐ(National Highway Authority of India) కోరింది. విస్తరణ జరిగితే మన్ననూరు నుంచి దోమలపెంట వరకు రోడ్డుకు ఇరువైపులా సుమారు 10వేల వృక్షాలు కూల్చక తప్పదని అటవీశాఖ(telangana forest department) అంచనా వేసింది.
వాహనాల జోరు పెరిగితే.. వన్యప్రాణులు మిగలవు
"ఈ రహదారి మార్గంలో అటూఇటూ తిరుగాడే వన్యప్రాణుల రాకపోకలకు అనువుగా వంతెనలు కట్టడమూ సాధ్యం కాదు. శ్రీశైలం రోడ్డులో వాహనాల కారణంగా అక్టోబరులోనే 59 అడవిజంతువులు మరణించాయి. రోడ్డును విస్తరిస్తే వాహనాల జోరు మరింతగా పెరగటం ఖాయం.. తద్వారా నెలకు 150 వరకు వన్యప్రాణులు మృత్యువాత పడే అవకాశముంది. ఆపై అవి మిగలడమూ కష్టం. ఫర్హాబాద్ తర్వాత దోమలపెంట వరకు ఉన్న మార్గంలో వాహనాలు పక్కకు మళ్లే అవకాశం కూడా లేదు. దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ రహదారిని ముందు క్రమబద్ధీకరించుకోవాలని ఎన్‌హెచ్‌ఏఐకి చెప్పాం."
- రోహిత్ గొప్పిడి, ఎఫ్‌డీవో, అమ్రాబాద్
స్పీడ్‌బ్రేకర్ల ఏర్పాటుకూ ఎన్‌హెచ్‌ఏఐ స్పందన లేదు..
"765 జాతీయ రహదారిలో వాహనాల జోరు పెరిగి, టైగర్ రిజర్వులో ప్రమాదాలు జరుగుతున్నాయి. వాటిని నియంత్రించడానికి 22 చోట్ల వేగనిరోధకాలు(స్పీడ్‌బ్రేకర్లు) ఏర్పాటుచేయాలని కోరాం.. ఎన్‌హెచ్‌ఏఐ స్పందించడం లేదు. వారు అనుమతించకుంటే మేమే బారికేడ్లు పెట్టాలనుకుంటున్నాం."
- బి.శ్రీనివాస్, ఫీల్డ్ డైరెక్టర్, అమ్రాబాద్ టైగర్ రిజర్వు