ETV Bharat / city

ఆ మిర్చియార్డులో కమీషన్​ ఏజెంట్​కు కరోనా పాజిటివ్

author img

By

Published : Jun 22, 2020, 4:53 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరులో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. మిర్చియార్డులో ఓ కమీషన్​ ఏజెంట్​కు కరోనా పాజిటివ్​ రావడం వల్ల మిర్చి క్రయవిక్రయాలపై సందిగ్ధం నెలకొంది. ఈ క్రమంలో అధికారులు అప్రమత్తమయ్యారు. మిర్చియార్డు పరిసరాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు.

ambiguity-on-merchandise-in-guntur-mirchiard-due-to-corona-positive-case
ఆ మిర్చియార్డులో కమీషన్​ ఏజెంట్​కు కరోనా పాజిటివ్

ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు మిర్చియార్డులో వ్యాపార లావాదేవీలు నిర్వహించే కమీషన్‌ ఏజెంట్‌కు కరోనా పాజిటివ్‌ రావడం వల్ల క్రయవిక్రయాలు కొనసాగించే విషయమై సందేహాలు తలెత్తుతున్నాయి. బ్రాడీపేటకు చెందిన ఓ కమీషన్‌ ఏజెంట్‌కు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు తేలడం వల్ల ఆయన్ని ఎన్నారై ఆసుపత్రిలోని క్వారంటైన్‌ కేంద్రానికి తరలించారు. ఆయన గురు, శుక్రవారాలు కూడా యార్డుకు వచ్చి పలువుర్ని కలిశారంటున్నారు. ఈ క్రమంలో పలువురు ఎగుమతి, దిగుమతి వ్యాపారులతో పాటు గుమస్తాలు, హమాలీల్లో ఆందోళన నెలకొంది.

రెండు నెలలు పాటు సెలవులు

లాక్‌డౌన్‌ కారణంగా మిర్చియార్డుకు రెండు నెలలు పాటు సెలవులు ప్రకటించి మిర్చి లావాదేవీలను నిలిపివేయగా.. గత నెల 25న లావాదేవీలను పునఃప్రారంభించారు. కొన్ని రోజులకే ఇక్కడ పని చేసే హమాలీకి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావటం వల్ల ఈనెల 7 వరకు సెలవులు ప్రకటించారు. ఈనెల 8 నుంచి మళ్లీ లావాదేవీలు ప్రారంభించారు. ప్రస్తుతం కమీషన్‌ ఏజెంట్‌కు కరోనా పాజిటివ్​గా తేలటం వల్ల మరో కోయంబేడు అవుతుందేమోనన్న భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు వ్యాపారులు. ఈ నేపథ్యంలో పాలకవర్గం, అధికార యంత్రాంగం యార్డులో కరోనా నివారణ చర్యలను ముమ్మరం చేశారు.

ద్రావణంతో పిచికారి

రైతు విశ్రాంతి భవనంతోపాటు పరిపాలనా భవనాన్ని సోడియం హైపో క్లోరైట్‌ ద్రావణంతో పిచికారి చేయించామని మిర్చియార్డు ఛైర్మన్‌ చంద్రగిరి ఏసురత్నం తెలిపారు. చిలకలూరిపేట రహదారి వైపున ఉన్న 2, 3 గేట్లలో నుంచి మిర్చి బస్తాలను అనుమతిస్తామని, రైతులు, హమాలీలకు శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేయించి లోపలకు అనుమతిస్తామని, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, కమీషన్‌ ఏజెంట్లు తమ దుకాణాల్లో శానిటైజర్లను అందుబాటులో ఉంచాలని సూచించారు.

ఇదీ చూడండి : కర్నల్​ సంతోష్​బాబు కుటుంబాన్నిపరామర్శించిన సీఎం కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.