ETV Bharat / city

రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణానికి భారీ కేటాయింపులు - telangana state budget

గృహనిర్మాణానికి బడ్జెట్ కేటాయింపులు భారీగా పెరిగాయి. కేవలం ప్రగతి పద్దులోనే ఏకంగా రూ.10,500 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న రెండు పడక గదుల ఇళ్లను పూర్తి చేయడమే కాకుండా.. ఎన్నికల హామీ అమలు దిశగా నిధులు కేటాయించింది. సొంతస్థలం కలిగిన పేదలు ఇళ్లు నిర్మించుకునేందుకు వీలుగా సర్కార్ ఆర్థికసాయం అందించనుంది. ఈ ఆర్థికసంవత్సరంలో లక్ష మంది లబ్దిదారులకు ఆర్థికసాయం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

allocate-for-housing-in-budget
ఇళ్ల నిర్మాణానికి భారీ కేటాయింపులు
author img

By

Published : Mar 8, 2020, 8:36 PM IST

పేదల ఆత్మగౌరవం నిలబెట్టేలా రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. బడ్జెట్ నిధులతో పాటు బడ్జెటేతర నిధులతో గృహాలను నిర్మిస్తోంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2,72,000 పైగా ఇళ్లు మంజూరు చేయగా... అందులో 1,72,000 పైగా నిర్మాణ దశలో ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోనే లక్ష ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఇందులో కొన్ని పూర్తి కాగా... మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి. స్థలాల లభ్యత, నిర్మాణ వ్యయం సరిపడకపోవడమే కాకుండా ఇతర కారణాల వల్ల నివాసాల నిర్మాణం అనుకున్నంత వేగంగా సాగడం లేదు.

గృహ నిర్మాణానికి రూ. 11,917 కోట్లు..

సొంతస్థలాలు ఉన్న పేదలు.. అక్కడే ఇళ్లు నిర్మించుకునేందుకు ఆర్థికసాయం చేస్తామని ఎన్నికల సమయంలో తెరాస హామీ ఇచ్చింది. ఎన్నికల హామీని అమలు చేయడమే కాకుండా.. ఇప్పటికే చేపట్టిన గృహాల నిర్మాణం పూర్తే లక్ష్యంగా బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించింది. మొత్తం గృహనిర్మాణానికి రూ. 11,917 కోట్లు కేటాయించగా.. అందులో ప్రగతిపద్దు రూ.10,500కోట్లు.

ఏకంగా రూ. 10,194 కోట్లు పెంపు..

2019-20లో కేవలం రూ.306 కోట్లు కేటాయించగా.. ఈ మారు ఏకంగా రూ.10,194 కోట్లు పెంచారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో లక్ష మంది లబ్దిదారులకు సొంతస్థలంలో ఇళ్లు నిర్మించుకునేందుకు.. అవసరమైన ఆర్థికసాయాన్ని సర్కార్ అందించనుంది. ప్రగతి పద్దులో ప్రతిపాదించిన రూ.10,500 కోట్లు.. బలహీనవర్గాల గృహనిర్మాణం కింద రూ.7,500 కోట్లు ప్రతిపాదించారు. రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణానికి రూ.7,000 కోట్లు, కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు రూ.500 కోట్లు కేటాయించారు. ఇళ్ల నిర్మాణం కోసం పట్టణ ప్రాంతాల్లో రూ.3,850 కోట్లు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.3,150 కోట్లు ఖర్చు చేయనున్నట్లు పేర్కొన్నారు.

ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి..

ప్రత్యేక అభివృద్ధి నిధి కింద.. రెండు పడక ఇళ్ల నిర్మాణం కోసం రూ.వెయ్యి కోట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం కోసం రూ.850 కోట్లు ప్రతిపాదించారు. ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద రూ.850 కోట్లు, పట్టణ ప్రాంతాల్లో గృహాల నిర్మాణం కోసం రూ.300 కోట్లు కేటాయించారు.

ఇవీ చూడండి: తెలంగాణ బడ్జెట్ కేటాయింపులు ఇవే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.