ETV Bharat / city

శతజయంతి వేడుకలకు రంగం సిద్ధం.. రేపే కార్యక్రమాల ప్రకటన

author img

By

Published : Jun 27, 2020, 7:08 PM IST

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. పీవీ సేవలు అందరికీ తెలిపేలా ఏడాది పాటు ఉత్సవాలు వైభవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సంవత్సరం పొడవునా నిర్వహించే కార్యక్రమాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రకటించనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 50 దేశాల్లోనూ పీవీ జయంతి వేడుకలు జరగనున్నాయి.

పీవీ శతజయంతి వేడుకలు
పీవీ శతజయంతి వేడుకలు
శతజయంతి వేడుకలకు రంగం సిద్ధం

దక్షిణ భారతదేశం నుంచి ప్రధాని పీఠాన్ని అధిరోహించిన మొదటి వ్యక్తి, తెలుగు తేజం, తెలంగాణ రాష్ట్రానికి చెందిన పాములపర్తి వెంకట నరసింహారావు శతజయంతి ఉత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. గొప్ప వ్యక్తి, విప్లవాత్మకమైన ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన మహనీయుడు, భారతదేశ చిత్రపటాన్ని అభివృద్ధి చెందుతున్న దేశాల సరసన నిలిపిన పీవీ శత జయంతి వేడుకలను.. ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నరసింహారావు వందో జయంతి సందర్భంగా ఆదివారం ప్రారంభంకానున్న ఉత్సవాలు ఏడాది పొడవునా జరగనున్నాయి.

'పీవీ.. తెలంగాణ ఠీవీ..'

హైదరాబాద్ నెక్లెస్​రోడ్​లో ఉన్న పీవీ జ్ఞానభూమి వద్ద ఆదివారం శతజయంతి వేడుకలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారు. నరసింహారావు దేశానికి, వివిధ రంగాలకు చేసిన సేవలు.. ప్రపంచానికి చాటేలా 'పీవీ.. తెలంగాణ ఠీవీ' అన్న తరహాలో ఉత్సవాలను నిర్వహించాలని నిర్ణయించారు సీఎం. ఇందుకోసం తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కే. కేశవరావు అధ్యక్షతన శతజయంతి ఉత్సవాల కమిటీని ఏర్పాటు చేశారు. పీవీ కుటుంబీకులు కూడా కమిటీలో సభ్యులుగా నియమించారు. కుటుంబ సభ్యులు, పీవీ స్నేహితులు, సన్నిహితులు, ప్రముఖులతో పాటు అందరి అభిప్రాయాలు, సూచనలు తీసుకుని ఏడాది పొడవునా శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్​ స్పష్టం చేశారు.

విదేశాల్లోనూ ఉత్సవాలు..

రాష్ట్రంతో పాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోనూ పీవీ శతజయంతి వేడుకలను నిర్వహించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇతర రాష్ట్రాలతో పాటు తెలుగువారు ఉంటున్న విదేశాల్లోనూ ఉత్సవాలను నిర్వహించాలన్న సీఎం.. వాటిని పర్యవేక్షించి, సమన్వయం చేసే బాధ్యతను మంత్రి కేటీఆర్​కు అప్పగించారు. 51 దేశాల్లో ఉంటున్న ప్రవాసీయులతో కేటీఆర్ ఇప్పటికే ఈ విషయమై చర్చించారు. ఇతర సంఘాలు, తెలుగువారందరితో కలిసి పీవీ శతజయంతిని నిర్వహించాలని కోరారు.

తెలిసింది కొంతే... తెలియాల్సింది చాలా..

శతజయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై పీవీ కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేశారు. పీవీ వ్యక్తిత్వం గురించి ప్రస్తుత తరానికి తెలియాల్సిన అవసరం ఉందని, శతజయంతి ఉత్సవాలు ఇందుకు మంచి వేదికవుతాయని వారు అభిప్రాయపడ్డారు. పీవీ గురించి తెలిసింది కొంతే... తెలియాల్సింది చాలా ఉందని వారు అభిప్రాయపడ్డారు.

సేవలను స్మరించుకునేలా..

బహుభాషాకోవిదుడైన పీవీ నరసింహారావు గొప్ప సాహితీవేత్త. వివిధ భాషల్లో ఎన్నో రచనలు చేశారు. భాషా, విద్యారంగాభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. పీవీ సేవలను స్మరించుకునేలా పుస్తకాల ముద్రణ, డాక్యుమెంటరీ, సెమినార్లు, సదస్సులు, వివిధ కార్యక్రమాలను ఏడాది పొడవునా నిర్వహించనున్నారు.

శతజయంతి ఉత్సవాల కోసం పీవీ జ్ఞానభూమిని అధికారులు ముస్తాబు చేశారు. నగరంలో హోర్డింగులు ఏర్పాటు చేశారు. ఏడాది పాటు నిర్వహించనున్న కార్యక్రమాల వివరాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రకటిస్తారు.

ఇవీ చూడండి: తెలుగు జాతి అనర్ఘరత్నం పీవీ నరసింహారావు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.