మున్సిపల్ ఎన్నికలను అన్ని పార్టీలకు ఆమోదయోగ్యమైన విధంగా నిర్వహించాలని కోరుతూ.. ఇవాళ అఖిల పక్ష నేతలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కలిశారు. తెదేపా, తెజస, సీపీఐ నేతలు సంయుక్తంగా ఎన్నికల కమిషనర్‌కు లేఖను సమర్పించారు. నూతన పురపాలక చట్టం ద్వారా ఎన్నికల సంఘం హక్కులను రాష్ట్ర ప్రభుత్వం లాక్కునే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. ఎన్నికలపై అందరికీ సమాన హక్కు ఉంటుందని... అన్ని పక్షాలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల తేదీ ఖరారు, నిర్వహణపై నిర్ణయాలు తీసుకోవాలని కోరారు.
ఇదీ చూడండి: 'ఏడాదిగా అసంతృప్తి... అందుకే ఈ నిర్ణయం'