ఇంటర్ ఫలితాల్లో గందరగోళం కారణంగా మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవడానికి అఖిలపక్ష నేతలు ముందుకొచ్చారు. ఇందులో భాగంగా తెలంగీ పీపుల్స్ సొసైటీ పేరిట బ్యాంకు ఖాతాను తెరిచి దాతల నుంచి విరాళాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. ఆత్మహత్యకు పాల్పడిన ఇంటర్ విద్యార్థిని మహేశ్వరి తల్లి సరస్వతికి లక్ష రూపాయల చెక్కును అందించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు లక్ష రూపాయలు అందించాలని డిమాండ్ చేశారు.
- ఇదీ చూడండి : వసతిగృహంలో బాలిక మృతి ఘటనపై ఎస్సీ కమిషన్ ఆరా