మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని నియంత్రించేందుకు ఆల్కహాల్ డిటెక్టర్ పరికరాన్ని రూపొందించిన విద్యార్థి సాయితేజకు ఆరుదైన పురస్కారం లభించింది. హైరేంజ్ బుక్ ఆఫ్ రికార్డు సంస్థ సాయితేజను తెలంగాణ యువ శాస్త్రవేత్త పురస్కారంతో సత్కరించింది. హైదరాబాద్ సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో జరిగిన కార్యక్రమంలో పలు అంతర్జాతీయ రికార్డులు సాధించిన జయంత్‌రెడ్డి, డాక్టర్ సంజయ్‌తో పాటు పలువురు పాల్గొని సాయితేజను అభినందించారు.
విజయం... నా తండ్రికి అంకింతం
తనకు లభించిన ఈ పుస్కారాన్ని సాయితేజ తన తండ్రికి అంకితం చేశారు. ఎన్నో కష్టాలు పడి తనను ప్రోత్సహించిన తల్లిదండ్రులకు రుణపడి ఉంటాయని అన్నారు. యువ శాస్త్రవేత్త అవార్డుతో సత్కరించడంపై సంతోషం వ్యక్తం చేసిన సాయితేజ... త్వరలోనే గిన్నిస్ బుక్ రికార్డు సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. త్వరలో ఆల్కహాల్ డిటెక్టర్ పరికరాన్ని మార్కెట్‌లోకి తీసుకొస్తానని తెలిపారు.
ఇవీ చూడండి: రికార్డ్: పావుకిలో బరువుతో పుట్టిన పాప క్షేమం