రాష్ట్రంలో వేలాది మంది కార్మికులకు సకాలంలో జీతాలు అందడం లేదని.. సమానపనికి సమాన వేతనం చెల్లించాలని కార్మికులు అనేక ఏళ్లుగా పోరాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఏఐటీయూసీ విమర్శించింది. హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లోని ఏఐటీయూసీ కార్యాలయం ఎదుట కార్మికులు నిరసన దీక్ష నిర్వహించారు. జీహెచ్ఎంసీ కార్మికులకు రూ.25 వేల జీతం, రిస్క్ అలవెన్సులు, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.
ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్ బోస్ ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా సమయంలో ప్రజలు, కార్మికులను ఆదుకునేందుకు దాతలు వేలకోట్లు ప్రభుత్వానికి అందించినా వాటి లెక్కలు చెప్పకుండా మాటలు దాటేస్తున్నారని ఆరోపించారు.
ఇదీ చూడండి : 'రాష్ట్రంలో కరోనా పరీక్షల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉంది'