ETV Bharat / city

లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డ ద్వారాకాపేట్ వీఆర్వో - లంచం తీసుకుంటు పట్టుబడ్డ ద్వారకాపేట్ వీఆర్వో రవీందర్

జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం ద్వారకాపేట్ వీఆర్వో లంచం తీసుకుంటుండగా... ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. పట్టాదారు పాసుపుస్తకంలో మార్పులు, చేర్పుల కోసం లంచం డిమాండ్ చేయగా... బాధితుడు అనిశాను ఆశ్రయించాడు.

లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డ ద్వారాకాపేట్ వీఆర్వో

author img

By

Published : Jan 21, 2021, 9:50 PM IST

పట్టాదారు పాసు పుస్తకంలో మార్పులు, చేర్పులు చేసేందుకు రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ... జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం ద్వారకాపేట్ గ్రామ రెవెన్యూ అధికారి రవీందర్ అనిశా వలకు చిక్కాడు. గ్రామానికి చెందిన విజయపాల్‌రెడ్డి అనే వ్యక్తి పాసుపుస్తకంలో మార్పులు చేయడానికి వీఆర్వో లంచం డిమాండ్ చేశాడు.

హైదరాబాద్​ హబ్సీగూడలోని కినరా గ్రాండ్ హోటల్​లో బాధితుడి నుంచి వీఆర్వో నగదు తీసుకుంటుండగా... ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. రవీందర్​ను అరెస్టు చేసి అనిశా ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. 14 రోజులు రిమాండ్ విధించి చంచల్​గూడ జైలుకు తరలించాలని న్యాయస్థానం ఆదేశించింది. ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్ చేస్తే... టోల్ ఫ్రీ నెంబర్ 1064కు సమాచారం ఇవ్వాలని ఏసీబీ అధికారులు కోరారు.

ఇదీ చూడండి: అక్రమంగా తరలిస్తున్న నిషేధిత గుట్కా స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.