ETV Bharat / city

చెప్పులు పారేశాడు.. సెలబ్రిటీ అయ్యాడు.. డబ్బే డబ్బు..! - barefoot guy in tiktok latest news

చెప్పుల్లేకుండా ఆఫీసుకు వెళ్లే మనిషిని మీరు ఎప్పుడైనా చూశారా? రెస్టారెంట్.. షాపింగ్ మాల్​లో అలాంటి వాళ్లు ఎప్పుడైనా ఎదురుపడ్డారా? మాగ్జిమమ్ ఎప్పుడూ.. ఎక్కడా.. చూసి ఉండరు. కానీ.. ఓ వ్యక్తి మాత్రం ఏడాది కాలంగా చెప్పుల్లేకుండా తిరుగుతున్నాడు. అతను.. డబ్బుల్లేని పేదవాడు అనుకుంటే మాత్రం.. చిరిగిపోయిన షూస్​లో కాలు పెట్టినట్టే! అతనికి ఏకంగా 20 జతల కాస్ట్​లీ బూట్లు, చెప్పులు ఉన్నాయి. వాటన్నింటినీ అవతల విసిరికొట్టి.. రెండు జేబుల్లో చేతులు పెట్టుకొని.. బేర్ ఫూట్​తో అలా నడుచుకుంటూ వెళ్లిపోతున్నాడు సంవత్సరకాలంగా...

barefoot man in England
barefoot man in England
author img

By

Published : Sep 28, 2022, 3:56 PM IST

చెప్పుల షాపులోకి ఎవరైనా వెళ్లారంటే.. ఒక పట్టాన సెలక్షన్ కంప్లీట్ కాదు. కాలికి అందంగా ఉన్నాయా లేవా? అన్నది ఒక పాయింట్ అయితే.. ఖరీదు ఎంత అన్నది మరో పాయింట్. వారి వారి ఆర్థిక స్థోమతను బట్టి.. టాప్ గ్రేడ్ పాదరక్షలనే కొనుగోలు చేస్తారు. అందుకే.. 100 రూపాయల చెప్పుల నుంచి.. మూడు, నాలుగు లక్షల విలువైన బూట్ల వరకూ అమ్మకానికి సిద్ధంగా ఉంటాయి.

ఇలాంటి పాదరక్షల్లో.. ఎన్ని జతలైనా కొనుగోలు చేసే కెపాసిటీ ఉన్న ఓ 20 ఏళ్ల యువకుడి చెప్పుల స్టాండ్​లో.. ఏకంగా 20 జతలు ఉండేవి. అంత రిచ్ కిడ్ అన్నమాట. అలాంటి వ్యక్తి ఉన్నట్టుండి ఆ చెప్పులన్నీ చెత్తకుండీలో విసిరేశాడు! అతనిపేరు జార్జ్​వుడ్ విల్లే. ఇంగ్లాండ్‌లోని కేంబ్రిడ్జ్‌కు చెందిన వాడు. ఏడాది ముందు వరకూ ఇతని లుక్ ఓ రేంజ్ లో ఉండేది. వారంలో ప్రతిరోజూ వేసిన షూస్ వేయకుండా.. తొడిగిన షర్ట్ తొడక్కుండా జల్సా చేసేవాడు.

అయితే.. లాస్ట్ అక్టోబర్​లో తల్లి, తాతతో కలిసి వాకింగ్ హాలిడేకు వెళ్లాడు. అప్పుడు అతనిలో ఓ ఆలోచన మెదిలింది. అసలు కాళ్లకు చెప్పులు ఎందుకు? వేసుకోకపోతే ఏమవుతుంది? అనే ప్రశ్న తనకు తానే వేసుకున్నాడు. ఇంట్లో వారిని అడిగితే.. ఏదో ఆన్సర్ ఇచ్చారు. ఆ సమాధానంతో సంతృప్తి చెందలేదు. దీంతో.. ఇక ఎప్పటికీ చెప్పులు వేసుకోకూడదని నిర్ణయించుకున్నాడు. ఏడాది కాలంగా అలాగే నడుస్తున్నాడు.

"నేను చెప్పుల్లేకుండా.. మొదటిసారిగా మా అమ్మ, తాతయ్యతో కలిసి రెస్టారెంట్‌కి వెళ్లాను. నిజంగా అదొక భిన్నమైన అనుభవం. అది నాకు ఎంతగానో నచ్చింది. గతంలో నేను ఇంట్లో కూడా చెప్పులు వేసుకునే తిరిగేవాడిని. ఇప్పుడు అవి లేకుండా గడ్డి మీద నడుస్తాను. మట్టిలో తిరుగుతాను. ఎంతో థ్రిల్లింగ్ గా ఉంది. అందుకే బేర్ ఫూట్ విధానాన్ని కంటిన్యూ చేస్తున్నాను." అంటాడు జార్జ్.

అయితే.. తాను చెప్పుల్లేకుండా తిరుగుతుంటే అందరూ వింతగా చూశారని.. ఇప్పటికీ కొందరు అలాగే చూస్తున్నారని చెప్పాడు జార్జ్ విల్లే. మరికొందరు అసహ్యంగా ముఖం పెట్టుకున్నారని కూడా గుర్తు చేసుకున్నాడు. అయినా కానీ.. తాను ఎన్నడూ ఇబ్బంది పడలేదని చెప్పాడు. చెప్పుల్లేకుండా నడిస్తే.. మట్టి, బురద అంటుకుంటాయి. వాటితో ఎవరి ఇంటికైనా వెళ్లాల్సి వస్తే.. కాళ్లు కడుక్కోవడానికి నీళ్లు అడుగుతాను తప్ప, ఎదుటి వాళ్లు ఏమనుకుంటారన్నది పట్టించుకోను అంటాడు జార్జ్. అయితే.. ఈ పద్ధతి మొదట్లో కొంచెం కష్టంగా ఉండేదన్నాడు. కానీ.. త్వరగానే అలవాటు పడ్డానని చెప్పాడు.

ఇలా సాగుతుండగా.. తన బేర్ ఫూట్ గురించి.. టిక్ టాక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్​లో పోస్టులు చేయడం ప్రారంభించాడు. చూస్తుండగానే.. ఫాలోవర్స్ ఊహించని రీతిలో పెరిగిపోయారు. ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే.. అతను వీడియో పెట్టకపోతే.. ఎందుకు పెట్టలేదని ఫ్యాన్స్ అడిగే వరకూ వచ్చింది. ఫాలోవర్స్ పెరగడంతో.. ఆదాయం రావడం మొదలైంది. మొదటి నెలలో 110 డాలర్లు సంపాదించిన జార్జ్.. ఆ తర్వాత వేగంగా తన ఆదాయాన్ని పెంచుకున్నాడు. భవిష్యత్ లో మిలియనీర్ అవుతానని అంటున్నాడు. ఒక ఆలోచ జీవితాన్ని మార్చడం అంటే.. ఇదేనేమో కదా!

ఇవీ చదవండి: చేనేత కార్మికులకు కేంద్రప్రభుత్వం ఏం చేసింది?: హరీశ్‌రావు

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్​న్యూస్​.. DA 4% పెంపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.