స్నేహితులతో కలిసి తిరుపతి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లిన.. ఓ యువకుడు అదృశ్యమయ్యాడు. ఈ సంఘటన రాచకొండ పోలీసు కమిషనరేట్ ఘట్‌కేసర్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. కొర్రెముల గ్రామానికి చెందిన రాధరామ్ బాలనర్సింహ్మ కొడుకు సంతోష్... గత నెల 27న తిరుపతి వెళ్తున్నట్లు కుటుంబసభ్యులకు చెప్పి బయలుదేరాడు. వారం రోజులు గడుస్తున్నా ఆచూకీ లేకపోవడం వల్ల తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. గత నెల 30నుంచి చరవాణి కూడా పనిచేయటం లేదని పోలీసులకు తెలిపాడు. దీనిపై అదృశ్యకేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: అబ్దుల్లాపూర్మెట్లో భూ మాఫియా... రెండు వర్గాలదే హవా