ETV Bharat / city

ఇల్లు స్వాధీనానికి వెళ్లిన అధికారులపై కారం చల్లి.. ఆపై ఇనుప రాడ్డుతో.. - ap latest crime news

న్యాయస్థానం ఆదేశాల్ని అమలు చేసేందుకు వెళ్లిన అధికారుల కళ్లల్లోకి ఓ మహిళ కారం చల్లింది. వారు తేరుకునేలోపే ఇనుప రాడ్డుతో దాడి చేసింది. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

sprinkling pepper on officials
sprinkling pepper on officials
author img

By

Published : Oct 26, 2021, 6:25 PM IST

Updated : Oct 26, 2021, 6:53 PM IST

ఇల్లు స్వాధీనానికి వెళ్లిన అధికారులపై కారం చల్లి.. ఆపై ఇనుప రాడ్డుతో..

న్యాయస్థానం ఆదేశాల్ని అమలు చేసేందుకు వెళ్లిన ప్రభుత్వ సిబ్బంది కళ్లలో కారం కొట్టిన ఘటన ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. రాయవరం మండలం నదురుబాద గ్రామానికి చెందిన మిర్తిపాటి జ్యోతికి చెందిన చౌక ధరల దుకాణం కోర్టు వివాదంలో ఉంది. ఈ దుకాణాన్ని లలిత మహిళ స్వశక్తి సంఘం సభ్యురాలికి అందజేయాల్సిందిగా న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. రెవెన్యూ అధికారులు ఆ ఇంటిని స్వాధీనం చేసుకునేందుకు వెళ్లగా... ఆమె నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది.

దీంతో స్వయంగా రామచంద్రపురం ఆర్డీవో సింధు సుబ్రహ్మణ్యం, డీఎస్పీ బాలచంద్రారెడ్డి సిబ్బందితో కలిసి జ్యోతి ఇంటికి వెళ్లారు. అదే సమయంలో తలుపులు మూసుకొని లోపలకు ఎవ్వరినీ రానీయకుండా అధికారులను ఇబ్బంది పెట్టింది. పోలీసులు, రెవెన్యూ, సచివాలయ సిబ్బంది బలవంతంగా తలుపులు తెరిచేందుకు ప్రయత్నించగా... అధికారుల కళ్లల్లో కారం చల్లింది. అనంతరం ఇనుప రాడ్డుతో దాడి చేసింది.

ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా, సిబ్బంది కళ్లల్లో కారం చల్లి, భౌతిక దాడికి పాల్పడిన జ్యోతిపై రాయవరం పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదీచూడండి: ఒక్కసారిగా పెట్రోల్ బంకులన్నీ బంద్​- సైబర్ దాడే కారణం!

Last Updated : Oct 26, 2021, 6:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.